![షబ్నమ్‌కు ఘన స్వాగతం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/5/04gpl22-320051_mr-1738699268-0.jpg.webp?itok=2UZb8Kqz)
షబ్నమ్‌కు ఘన స్వాగతం
గోపాలపట్నం: ఇటీవల కౌలాలంపూర్‌లో జరిగిన అండర్–19 మహిళల టీ–20 ప్రపంచ కప్ గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచిన నగరానికి చెందిన షబ్నమ్ షకీల్ మంగళవారం విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆమెకు 52వ వార్డు యువజన నాయకుడు జియ్యాని విజయ్, క్రికెట్ అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ఇటీవల విశాఖకు చెందిన క్రికెటర్లు మంచి ప్రతిభ చూపిస్తున్నారని అన్నారు. మహిళా క్రికెట్‌లో షబ్నమ్ షకీల్, పురుషుల క్రికెట్‌లో నితీష్ కుమార్‌రెడ్డి మంచి ప్రతిభ కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించారన్నారు. షబ్నమ్ ఈ ప్రపంచ కప్ సాధనలో కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. అనంతరం షబ్నమ్ తల్లిదండ్రుల్ని ఘనంగా సత్కరించారు.
తల్లిదండ్రుల ఆశీస్సులే కారణం
ప్రపంచ కప్‌లో ఘన విజయం సాధించడంలో తల్లిదండ్రుల ఆశీర్వాదం, వారి ప్రోత్సాహమే ప్రధాన కారణమని షబ్నమ్ అన్నారు. విశాఖ విమానాశ్రయంలో ఆమె విలేకర్లతో మాట్లాడారు. తన తల్లి దండ్రులు ఎంతో కష్టపడి తనకు శిక్షణ ఇప్పించి, ఈ స్థాయికి తీసుకు వచ్చారని పేర్కొన్నారు. ప్రపంచ కప్ టోర్నీలో అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ కప్ మ్యాచ్‌లలో ఎటువంటి ఒత్తిడికి గురవకుండా ఆటను ఎంజాయ్ చేసినట్లు చెప్పారు. అందుకే మంచిగా రాణించి కప్ గెలిచామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment