గ్రామీణ ‘మణి కిరణం’
● స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలో జేఈగా ఎంపికై న రైతు బిడ్డ
మణికిరణ్‌కు స్వీట్ తినిపిస్తున్న తల్లిదండ్రులు
రోలుగుంట: అతనిది ఓ కుగ్రామం. రైతు కుటుంబం నుంచి వచ్చాడు. చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకొని డిప్లొమా తీసుకున్నాడు. తన లక్ష్యాలన్నింటినీ అధిగమిస్తూ.. ఎస్‌ఎస్‌సీ జేఈ పరీక్షలో సీపీడబ్ల్యూడీలో ఆలిండియా స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించాడు. రోలుగుంట మండలం కొండపాలేనికి చెందిన గాలి అర్జున, లక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు వినాయక మణికుమార్. అయిదో తరగతి వరకూ కొండపాలెం ప్రభుత్వ పాఠశాలలో చదివి, ఆరు నుంచి పది వరకు మండల కేంద్రం రోలుగుంటలో చదివాడు. తరువాత బొబ్బిలిలో తాండ్రపాపారాయుడు కాలేజీలో డిప్లొమా చేశాడు. కష్టపడి సాధన చేసి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీపీడబ్ల్యూడీ డిపార్టుమెంట్ కోసం నిర్వహించిన పరీక్షలో జాతీయ స్థాయిలో నాలుగోవాడిగా నిలిచాడు. జేఈగా ఉద్యోగం సాధించాడు. గ్రామ మాజీ సర్పంచ్ బంటు సూర్య సన్యాసిదేముళ్లు, గ్రామంలోని యువత అతనిని అభినందనల్లో ముంచెత్తారు. ఇతని తమ్ముడు శివభాస్కర్ గత ఏడాది రైల్వేలో ఏఈగా ఎంపికయ్యాడు. ఇద్దరు కుమారులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు.
Comments
Please login to add a commentAdd a comment