రాప్తాడులో సామాజిక సాధికార యాత్రకు స్వాగతం పలుకుతూ వెలిసిన ఫ్లెక్సీలు
రాప్తాడు: జగనన్న పాలనలో బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులు, జరిగిన అభివృద్ధిని వివరించేందుకు వైఎస్సార్సీపీ తలపెట్టిన మూడో విడత సామాజిక సాధికార బస్సు యాత్ర సోమవారం నియోజకవర్గ కేంద్రమైన రాప్తాడుకు చేరుకోనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభలో గత టీడీపీ ప్రభుత్వం పేదలకు చేసిన మోసాన్ని ఎండగట్టనున్నారు. సీఎం జగన్ కులమతాలకు అతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందజేయడంతో పాటు అన్ని సామాజిక వర్గాలకూ రాజకీయంగా ప్రాధాన్యమివ్వడాన్ని వివరించనున్నారు. సామాజిక సాధికారత పేరుతో చేపడుతున్న బస్సు యాత్రకు నియోజకవర్గ ప్రజలు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. సామాజిక చైతన్యంతో సాధికార స్వరం వినిపించనున్నారు.
రాప్తాడులో బైక్ ర్యాలీ..
రాప్తాడులో సోమవారం మధ్యాహ్నం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టనున్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి యువత భారీగా తరలిరానుంది. బైక్ ర్యాలీని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభిస్తారు. బస్సు యాత్ర ముందు బైక్ ర్యాలీ సాగుతుంది. ర్యాలీలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఆయన సోదరులు తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొననున్నారు.
బస్టాండు సర్కిల్లో బహిరంగ సభ..
రాప్తాడులో సామాజిక సాధికార బస్సు యాత్ర మధ్యాహ్నం 3 గంటలకు బస్టాండు సర్కిల్ చేరుకోనుంది. అక్కడి నుంచి డాన్ బోస్కో స్కూల్, ఆర్డీటీ కార్యాలయం, సెరికల్చర్ కార్యాలయం మీదుగా గంగలకుంట రోడ్డు, 44వ జాతీయ రహదారి మీదుగా వైఎస్సార్ సర్కిల్‌కు చేరుకుంటుంది. అక్కడ దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించనున్నారు. తర్వాత ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా బహిరంగ సభ జరుగుతుంది.
హాజరు కానున్న ప్రముఖులు..
బస్సు యాత్రకు ప్రముఖులు తరలివస్తున్నారు. వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా, మంత్రులు మేరుగు నాగార్జున, గుమ్మనూరు జయరాం, ఎంపీ నందిగం సురేష్, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, జిల్లా నుంచి మంత్రి ఉషశ్రీ చరణ్, ఎంపీలు గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, అహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు శంకర నారాయణ, సిద్దారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి తదితరులు హాజరవుతారు.
నేడు రాప్తాడులో సామాజిక
సాధికార సభ
హాజరుకానున్న మంత్రులు,
ప్రజా ప్రతినిధులు
ఘన స్వాగతం పలికేందుకు
సిద్ధమైన ప్రజలు
Comments
Please login to add a commentAdd a comment