‘తప్పుడు పద్ధతులను యూనియన్‌ సమర్థించదు’ | - | Sakshi
Sakshi News home page

‘తప్పుడు పద్ధతులను యూనియన్‌ సమర్థించదు’

Published Mon, Aug 26 2024 12:36 PM | Last Updated on Mon, Aug 26 2024 12:36 PM

-

అనంతపురం సెంట్రల్‌: తప్పుడు పద్ధతులను యూనియన్‌ ఎప్పటికీ సమర్థించదని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శకుంతల, రమాదేవి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘వయసు తగ్గించి .. విధుల్లోనే నక్కి’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లోప్రచురితమైన కథనంపై వారు స్పందించారు. ఐసీడీఎస్‌ తాడిపత్రి ప్రాజెక్టులో కొందరు ఫేక్‌ సర్టిఫికెట్లతో విధుల్లో కొనసాగుతున్న అంశంతో యూనియన్‌కు సంబంధం లేదన్నారు. ఫేక్‌ సర్టిఫికెట్ల వ్యవహారంలో వర్కర్లే కాకుండా అధికారుల హస్తం కూడా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement