ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం
కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు గడిచినా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది. సమస్యలను పక్కదారి పట్టించే యోచనలో ఉన్న ప్రభుత్వానికి హెచ్చరిక చేయడానికే వివిధ డిమాండ్లతో వేలాది మందితో ర్యాలీని చేపట్టాం. పంటలు సరిగా పండక, పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ర్యాలీ చేస్తున్నామని తెలియడంతో మద్దతు ధర పేరుతో ఇక్కడ ఫ్లెక్సీలు వేయడం కాదు.. ప్రకటించిన మొత్తాన్ని ఇవ్వాలి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయంగా ఏటా రూ.13,500 అందజేశాం. ఐదేళ్ల కాలంలో జిల్లా రైతాంగానికి ఏకంగా రూ.1900 కోట్లు పెట్టుబడి సాయంగా అందింది. కూటమి ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు ఇస్తామని చెప్పినా ఇంత వరకూ ఇవ్వలేదు. ఎరువులు, పురుగు మందులను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతూ రైతులను మోసం చేస్తున్నారు. ఎంఆర్‌పీకే రైతులకు విక్రయించాలి. నకిలీ బయో ప్రాడక్ట్స్ మార్కెట్‌లో విపరీతంగా ఉన్నాయి. వాటిని లేకుండా చేయాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మకై ్క వ్యాపారులతో రైతులు పండించిన పంటకు ధర కల్పించడం లేదు. రైతులను నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేదిలేదు. ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమై ప్రభుత్వం మెడలు వంచైనా రైతులకు అండగా నిలుస్తాం.
– అనంత వెంకటరామిరెడ్డి,
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment