● అన్నదాత సుఖీభవ కింద రైతులకు పెట్టుబడి సాయం రూ.20 వేలు అందజేయాలి.
● వరి, వేరుశనగ, మొక్కజొన్న, కంది, ఆముదం, పత్తి, తదితర పంటలను మద్దతు ధరకు అనుగుణంగా కొనుగోలు చేయాలి. అందుకు ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
● రైతులపై ప్రీమియం భారం వేయకుండా ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలి.
● రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులందరికీ డ్రిప్, స్ప్రింక్లర్లు పంపిణీ చేయాలి.
● ఖరీఫ్ 2023–24 సీజన్‌కు సంబంధించి ఉచిత పంటల బీమా కింద పరిహారం చెల్లించాలి. 2023 రబీలో కరువు జాబితాలో ప్రకటించిన 17 మండలాల రైతులకు రూ.32 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలి.
● వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యవస్థలో దళారుల ప్రమేయాన్ని అరికట్టాలి.
● రైతు సేవా కేంద్రాల ద్వారా గ్రామాల్లోనే విత్తనాలు, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్‌ను ఎమ్మార్పీ ధరకే అందించేలా చర్యలు తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment