అనంతపురం అర్బన్: జిల్లాలో సాగునీటి సంఘాలకు ఎన్నికల ప్రక్రియ శనివారంతో పూర్తవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించి వివరాలను శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాగునీటి సంఘాల ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యుల ఎన్నిక, సంఘాల అధ్యక్షుల, ఉపాధ్యక్షుల ఎన్నిక శనివారంతో పూర్తవుతుందన్నారు. 17వ తేదీన సర్వసభ్య సమావేశాలు నిర్వహించి డిస్ట్రిబ్యూటరీ కమిటీల అధ్యక్షులను ఎన్నుకుంటారని తెలిపారు. జిల్లాలో మొత్తం 149 సాగునీటి వినియోదారులు సంఘాలు, 6 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఉన్నాయని వెల్లడించారు. భారీ నీటి పారుదలలో 54 సాగునీటి వినియోదారుల సంఘాలు, 648 ప్రాదేశిక నియోజకవర్గాలు, మధ్య తరహా నీటి పారుదలలో 6 సాగునీటి వినియోదారుల సంఘాలు, 72 ప్రాదేశిక నియోజకవర్గాలు ఉన్నాయని పేర్కొన్నారు. అదే విధంగా చిన్ననీటి పారుదలలో 89 సాగునీటి వినియోగదారుల సంఘాలు, 534 ప్రాదేశిక నియోజకవర్గాలు ఉన్నాయన్నారు. వీటి ఎన్నికల నిర్వహణకు వివిధ శాఖల నుంచి సిబ్బందిని నియమించడంతో పాటు శిక్షణ కూడా ఇచ్చామన్నారు. ఓటరుగా నమోదైన వారు ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
పకడ్బందీగా నిర్వహిస్తామన్న
కలెక్టర్ వి.వినోద్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment