లోక్ అదాలత్‌లో ఇరువురూ విజేతలే
అనంతపురం: సాధారణంగా ఏ కేసులోనైనా ఒక వైపు మాత్రమే విజయం వరిస్తుందని, అదే లోక్ అదాలత్‌లో ఇరు వైపులా (ఉభయులూ) విజేతలేనని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి (జిల్లా జడ్జి) జి.శ్రీనివాస్ అన్నారు. జిల్లా కోర్టులో శనివారం లోక్ అదాలత్‌ను జిల్లా జడ్జి ప్రారంభించారు. ఎస్పీ పి.జగదీష్, జిల్లా న్యాయశాఖాధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
6,235 కేసుల పరిష్కారం..
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో 6,235 కేసులు పరిష్కారమయ్యాయి. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో మొత్తం 25 బెంచ్‌ల ద్వారా కేసులు విచారించారు. ఈ సందర్భంగా 5,753 క్రిమినల్ కేసులు, 151 సివిల్ కేసులు, 66 మోటారు వాహన ప్రమాదభరిత కేసులు, 271 ప్రీలిటిగేషన్ కేసులకు పరిష్కారం దక్కింది. ప్రమాదభరిత కేసుల కక్షిదారులకు రూ.5.67 కోట్ల పరిహారం చెల్లింపునకు రాజీ కుదిర్చారు. సివిల్ కేసుల్లో రూ.31,96,134, ప్రీలిటిగేషన్ కేసుల్లో రూ.1.21 కోట్ల పరిహారాన్ని కక్షిదారులకు న్యాయమూర్తులు ఇప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment