సైబర్ వలలో మున్సిపల్ కార్మికుడు
రాయదుర్గంటౌన్: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని ఓ మున్సిపల్ కార్మికుడు రూ.60 వేలు పోగొట్టుకున్నాడు. రాయదుర్గం పురపాలకసంఘంలోని ఇంజినీరింగ్ వాటర్ వర్క్స్ విభాగంలో సురేష్ పనిచేస్తున్నాడు. ఇతడికి వినోద్ రాజ్ అనే అపరిచిత వ్యక్తి 99894 73081 నంబర్ నుంచి కాల్ వచ్చింది. ‘నీకు రూ.2.50 లక్షల లాటరీ తగిలింది. నీవు నాకు రూ.60 వేలు చెల్లిస్తే లాటరీ డబ్బు నీ అకౌంట్‌కు పంపుతాం’ అని అపరిచిత వ్యక్తి చెప్పాడు. నిజమని నమ్మిన సురేష్ విడతల వారీగా శుక్ర, శనివారాల్లో రూ.60 వేల నగదును గూగుల్ పే ద్వారా అపరిచిత వ్యక్తికి పంపాడు. ఆ తరువాత నుంచి అతడి ఫోన్ స్విచాఫ్ రావడంతో తాను మోసపోయానని గ్రహించిన సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రూ.60 వేలు పోగొట్టుకున్న వైనం
Comments
Please login to add a commentAdd a comment