పెద్దపప్పూరు: చామంతి పంట సాగులో ఆశించిన దిగుబడి సాధించాలనే లక్ష్యంతో ఓ రైతు తన పొలంలో ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటు చేయడం ఆకట్టుకుంటోంది. పెద్దపప్పూరు చితంబరస్వామి కాలనీకి చెందిన రైతు సూర్యనారాయణ నాలుగు ఎకరాల్లో చామంతి పూలు సాగు చేస్తున్నాడు. చామంతి మొక్క ఎదుగుదల దశలోనే మొగ్గలు వస్తే ఆశించిన దిగుబడి రాదని పలువురు రైతులు సూర్యనారాయణకు చెప్పారు. పంట చుట్టూ ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేస్తే కాంతి ప్రభావంతో మొగ్గలు రావని తెలిపారు.
మొక్క నాటినప్పటి నుంచి 40 రోజులు ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో సూర్యనారాయణ పంట చుట్టూ ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటు చేశారు. రోడ్డు పక్కనే పొలం ఉండటంతో రాత్రిళ్లు కొత్త అనుభూతి కలుగుతోంది. అటువైపు వెళ్లే వాహనదారులు ఆశ్చర్యంతో చూస్తున్నారు. రైతు ఆలోచన భలేగా ఉందని, దిగుబడి బాగా వచ్చి లాభాలు కూడా మంచిగా రావాలని కోరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment