తాత్కాలిక సీనియార్టీ జాబితా సిద్ధం
అనంతపురం ఎడ్యుకేషన్: అనంతపురం ముని సిపల్ కార్పొరేషన్, ఉమ్మడి జిల్లాలోని మునిసిపాలిటీల పరిధిలోని పాఠశాలలకు సంబం ధించి పీఎస్ హెచ్‌ఎం, తెలుగు, హిందీ, ఉర్దూ స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించేందుకు తాత్కాలిక సీనియార్టీ జాబితా సిద్ధం చేశారు. https:// deoananthapuramu.blog spot.com వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు డీఈఓ ఎం.ప్రసాద్‌బాబు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జాబితాను పరిశీలించి ఏవైనా అభ్యంతరాలుంటే శుక్రవారం సాయంత్రం 5 గంటలలోపు సరైన ఆధారాలతో హెచ్‌ఎం, ఎంఈఓల ద్వారా డీఈఓ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
7న కేంద్ర బృందం పర్యటన
అనంతపురం అగ్రికల్చర్: ఈ ఖరీఫ్‌లో నెలకొన్న కరువు పరిస్థితులను తెలుసుకునేందుకు ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకూ ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం పర్యటించ నున్నట్లు వ్యవసాయశాఖ అధికారవర్గాలు వెల్లడించాయి. ఈనెల 2,3 తేదీల్లో పర్యటన ఉండగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అనంతపురం జిల్లాలో 7, శ్రీ సత్యసాయి జిల్లాలో 10 మండలాలను కరువు జాబితాలో ప్రకటించారు. వ్యవసాయ అధికారులు ఆయా మండలాల్లో పంట నష్టం అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. రూ. 19 కోట్ల వరకూ నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కరువు బృందం జిల్లాల పర్యటనకు రానుంది.
నేడు ఎంఈఓ–1,2లకు ఓరియంటేషన్
అనంతపురం ఎడ్యుకేషన్: సమగ్ర శిక్ష ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ (సహిత విద్య) విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం మండల విద్యాశాఖ అధికారులు–1,2లకు ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లల కోసం సహిత విద్య ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పథకాలు, బడిబయట పిల్లలను గుర్తించి తిరిగి బడిలో చేర్పించడం తదితర అంశాలపై ఓరియంటేషన్ ఉంటుందని డీఈఓ, సమగ్రశిక్ష ఏపీసీ ప్రసాద్‌బాబు తెలిపారు. పరిశీలకులుగా ఎస్పీడీ ఐఈడీ విభాగం నుంచి నరసింహ, మల్లికార్జున హాజరవుతున్నారన్నారు. స్థానిక సైన్స్ సెంటర్‌లో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభవుతుందని, ఎంఈఓలు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment