జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయం
అనంతపురం అర్బన్: జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేద్దామని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. గురువారం అనంతపురంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కేక్ కట్ చేసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్‌కు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డీఆర్‌ఓ మలోల శుభాకాంక్షలు తెలిపారు. వివిధ శాఖ అధికారులు, ఉద్యోగులు పూలమొక్కలు, పుస్తకాలు తదితర సామగ్రి అందజేసి శుభాకాంక్షలు చెప్పారు. వేడుకలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం రూపొందించిన నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ను, జేఏసీ అమరావతి, కో–ఆపరేటివ్ క్యాలెండర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు సత్వరం అందించాలన్నారు. కొత్త సంవత్సరంలో లక్ష్యాలను నిర్దేశించుకుని నూతనోత్సాహంతో వాటిని అఽధిగమించాలని సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు, జేఏసీ అమరావతి చైర్మన్ దివాకర్‌రావు, మహిళ విభాగం చైర్‌పర్సన్ సురేఖరావు, జేఏసీ ప్రధాన కార్యదర్శి పీఎస్‌ఖాన్, సంఘాల నాయకులు మురళీధర్, లక్ష్మీనారాయణ, పునీత్‌బాబు, సురేఖరావు, కృష్ణజ్యోతి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ వినోద్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment