రోగులను మోసుకెళ్లాల్సిందేనా..?
●ఎంఎన్‌ఓ/ ఎఫ్‌ఎన్‌ఓ విధుల్లో నిర్లక్ష్యం ●ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం
అనంతపుం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో పలువురు వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో రోగులు ప్రత్యక్ష నరకం చూడాల్సి వస్తోంది. అవుట్ పేషంట్/ ఇన్‌పేషంట్ రోగులు నడవలేని స్థితిలో ఉంటే వారిని ఎక్స్‌రే, సీటీ, ఎంఆర్‌ఐ, అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షల కోసం వీల్‌చైర్, స్ట్రెచర్‌పై ఆయా విభాగాల వద్దకుసెంఎన్‌ఓ/ఎఫ్‌ఎన్‌ఓలు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే అవసరమైన సమయంలో వీరు కనిపించరు. వారికోసం గంటల తరబడి ఎదురుచూడలేక రోగుల సహాయకులే విధిలేని పరిస్థితుల్లో చేతులపై, భుజాలపై మోసుకెళ్తున్నారు. శుక్రవారం కోల్‌కతాకు చెందిన పితుల్ అనే మహిళ అనారోగ్యంతో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. ఆమెకు సీటీ, తదితర పరీక్షలు చేయించాలని వైద్యులు సూచించారు. నడవలేని స్థితిలో ఉన్న ఆమెను తీసుకెళ్లడానికి సిబ్బంది ఎవరూ రాకపోవడంతో కుమారుడు సజల్ మొదటి అంతస్తు నుంచి మోసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం తిరిగి తల్లిని మోసుకుని మెట్లు ఎక్కి పై అంతస్తుకు చేర్చాడు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకే సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రోగులు విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment