షీప్ సొసైటీ ఎన్నికలకు వేళాయె
అనంతపురం అగ్రికల్చర్: గొర్రెలు, మేకల పెంపకందారుల ప్రాథమిక పరపతి సహకార సంఘాల (షీప్ సొసైటీ) ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. జిల్లాలో 121 సొసైటీలు ఉండగా, మొదటి విడతగా ఈనెల 7న మంగళవారం 36 సొసైటీలకు ఎన్నికలు జరిపేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రెండో విడతగా ఈనెల 18న, మూడో విడత కింద 25న, చివరి విడతగా ఫిబ్రవరి 5న ఎన్నికలు నిర్వహించనున్నారు. సొసైటీ పరిధిలో 7 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించి తర్వాత అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. వీరి పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది. సొసైటీలకు పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా ఉన్న పశువైద్యుల ఆధ్వర్యంలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఏడీ డాక్టర్ కేఎల్ శ్రీలక్ష్మి తెలిపారు. ప్రాథమిక సంఘాల ఎన్నికలు పూర్తయ్యాక జిల్లా కమిటీ ఎన్నిక ఉంటుందని వివరించారు. కాగా జిల్లాలోని అన్ని షీప్ సొసైటీలను దక్కించుకునేందుకు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగినట్లు సమాచారం. ప్రత్యర్థి పార్టీకి ఒక్కటి కూడా దక్కకుండా పావులు కదుపుతున్నట్లు తెలిసింది.
రేపు ఎన్నికలు జరగనున్న సొసైటీలు..
పూలకుంట, కాటికానికాలువ, ఆత్మకూరు, పి.సిద్ధరాంపురం, వడ్డుపల్లి, రంగంపేట, వేపచెర్ల, అమ్మవారుపేట, బుక్కరాయసముద్రం, నీలారెడ్డిపల్లి, హనిమిరెడ్డిపల్లి, బొమ్మనహాళ్, సోమలాపురం, ముకుందాపురం, అబ్బేదొడ్డి, బ్రాహ్మణపల్లి, గోనబావి, నాగసముద్రం, ముదినాయనిపల్లి, ఎం.వెంకటంపల్లి, బాలవెంకటాపురం, హనకనహల్, యల్లచింతల, బండ్లపల్లి, మంగపట్నం, నరసాపురం, పులసలనూతల, కట్టకిందపల్లి, పెద్దపప్పూరు, కొండుపల్లి, అరకటివేముల, ఎం.చెర్లోపల్లి, వడ్రహొన్నూరు, సోదనపల్లి, నింబగల్, పీసీపీ కొత్తకోట.
రెండో విడత: క్రిష్ణమరెడ్డి, కామారుపల్లి, కుర్లపల్లి, ఎంజీ తండా, బి.యాలేరు, గొరిదిండ్ల, బద్రంపల్లి, చెన్నంపల్లి, సిద్ధరాంపురం, దుద్దేకుంట, బొల్లనగుడ్డం, పి.కొత్తపల్లి, కొత్తపేట, గొల్లపల్లి, నక్కలదొడ్డి, గరుడాపురం, పాలవాయి, మానిరేవు, ఈస్ట్‌కోడిపల్లి, ఆదిగానిపల్లి, జెల్లిపల్లి, కుందుర్పి, బొందలవాడ, గడ్డంనాగేపల్లి, నార్పల, నాయనిపల్లి, కాలాపురం, తురకపల్లి, కడవకల్లు, రాప్తాడు, పాలచెర్ల, 74 ఊడేగోళం, చిన్నమట్లగొంది, రాకెట్ల, పందికుంట, పీసీ ప్యాపిలి.
మూడో విడత: జంగాలపల్లి, ముట్టాల, తలుపూరు, సనప, తోపుదుర్తి, మదిగుబ్బ, బి.కొత్తపల్లి, దండువారిపల్లి, జంతలూరు, ఉంతకల్, పెనకచెర్ల, గొందిపల్లి, తాళ్లకెరె, పాతకొత్తచెరువు, కాపర్లపల్లి, సీబాయి, తిమ్మసముద్రం, విట్లంపల్లి, వైసీ పల్లి, మాల్యం, మరుట్ల–1, రుద్రంపల్లి, బి.పప్పూరు, హెచ్.సోదనపల్లి, నడిమిదొడ్డి, రంగాపురం, గూగూడు, గజరాంపల్లి, యర్రగుంట్ల, గొందిరెడ్డిపల్లి, వెస్ట్ నరసాపురం, ఇగుడూరు, లత్తవరం, దొనేకల్లు, యాడికి.
నాటుగో విడత: దోసలుడికి, గొల్లొలదొడ్డి, సొరకాయలపేట, ఖాదర్‌పేట, పాలెంతండా, ఓబులాపురం, చెర్లోపల్లి, బండమీదపల్లి, ఉరవకొండ, వీపీ తండా, రాగులపాడు, హవలిగి, పాల్తూరు, బుక్కాపురం.
Comments
Please login to add a commentAdd a comment