నేడు శింగనమలలో ‘పరిష్కార వేదిక’
● కలెక్టరేట్‌లో ఉండదు
అనంతపురం అర్బన్: కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశాల మేరకు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ను సోమవారం శింగనమల నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించనున్నట్లు కార్యక్రమ ఇన్‌చార్జ్ వాణిశ్రీ తెలిపారు. కలెక్టరేట్‌లో కార్యక్రమం ఉండదన్నారు. శింగనమల తహసీల్దారు కార్యాలయంలో జరగనున్న ‘పరిష్కార వేదిక’లో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు.
జిల్లా అండర్–12
క్రికెట్ జట్టు ఎంపిక
అనంతపురం: నగరంలో ఆదివారం జిల్లా అండర్–12 బాలుర క్రికెట్ జట్టును ఎంపిక చేశారు. సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా కమలాకర్ నాయుడు, సభ్యులుగా ఎస్‌ఎల్‌ఎన్ ప్రసాద్, ఎం. భార్గవ్ ఉన్నారు. ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకు కడపలో జరగనున్న సౌత్ జోన్ మ్యాచ్‌లో ఈ జట్టు ప్రాతినిధ్యం వహించనున్నట్లు వారు తెలిపారు.
జట్టులో చోటు దక్కించుకున్న వారు..
హవీష్ రెడ్డి, ఏ. హేమచంద్రా నాయక్, జి. ధనుష్, జై వీర్ రెడ్డి, ఎం. తమోగ్న, లలిత్ కిశోర్, రోహితేశ్వర రాజు, చరణ్ తేజ్ (అనంతపురం), రామ్ చరణ్ (హిందూపురం), బి. ఉత్తేజ్ యాదవ్, ఎస్కే ఇస్మాయిల్ (గుంతకల్లు), బీఎం మోక్షజ్ఞ తేజ (కళ్యాణదుర్గం), టి. గణేష్ (ధర్మవరం),బృందావన్, ఎస్. వెంకట లిఖిత్ రెడ్డి (తాడిపత్రి), స్టాండ్ బై (కుషాల్ రాయల్, అనంతపురం), కమ్రణ్ ఫహద్ (హిందూపురం), మన్నన్ లలిత్ సాయి (అనంతపురం), ఎం. రాజా (ధర్మవరం), బి. ప్రజ్వల్ (నార్పల).
వస్తారు.. వెళ్తారు!
● నామ్‌కేవాస్తుగా సాగనున్న
కేంద్ర బృందం పర్యటన
అనంతపురం అగ్రికల్చర్: కరువు పరిస్థితులు ప్రత్యక్షంగా తెలుసుకునే నిమిత్తం ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం (ఐఎంసీటీ) ఈనెల 8న జిల్లాలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. 46 మండలాల రైతులకు అన్యాయం చేస్తూ కూటమి సర్కారు తూతూ మంత్రంగా ఉమ్మడి జిల్లా పరిధిలో కేవలం 17 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించగా... అందుకు తగ్గట్టుగానే కేంద్ర బృందం పర్యటన నామ్‌కే వాస్తు అన్నట్లుగా సాగనుంది. ఈనెల 8న మధ్యాహ్నం 2.30 గంటలకు జిల్లాలో ప్రారంభం కానున్న బృంద సభ్యుల పర్యటన.. సాయంత్రం 5 గంటలకే పూర్తి కానుండటం గమనార్హం. ఈ మేరకు ఆదివారం వ్యవసాయ శాఖ అధికారులు రూట్‌మ్యాప్ విడుదల చేశారు. అనంతపురం రూరల్ మండలం మన్నీలతో పాటు రాప్తాడులో సభ్యులు పర్యటిస్తారు. మరోవైపు శ్రీ సత్యసాయి జిల్లాలో కూడా కేవలం నాలుగు గంటలే కేంద్ర బృందం పర్యటన సాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment