పస్తులుండలేక పడబాట్లు
పనులు మానుకుంటున్నారు. బారులు తీరుతున్నారు. సర్వర్ సతాయింపులతో మళ్లీ మళ్లీ తిరుగుతున్నారు. అవస్థలు పడుతూనే సరుకులు తీసుకెళ్తున్నారు. దుకాణాల వద్దకే వచ్చి రేషన్ సరకులు తీసుకోవాలని కూటమి సర్కారు ఆదేశాలు జారీ చేయడంతో నెలానెలా లబ్ధిదారుల అవస్థలు చెప్పనలనవిగా మారాయి. చంటిబిడ్డలు గల తల్లులు, వృద్ధులు, దివ్యాంగుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంటోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే వచ్చి రేషన్ పంపిణీ చేయడంతో ఇబ్బందులే ఉండేవి కావని పేద ప్రజలు గుర్తు
చేసుకుంటున్నారు. మంచి కార్యక్రమానికి
మంగళం పాడి తమకు కష్టాలు తెచ్చిపెట్టారని నిట్టూరుస్తున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment