జిల్లా అంతటా శనివారం చలి వాతావరణం నెలకొంది. ఈశాన్యం దిశ
వణికిపోతున్నారు
● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా
ఉష్ణోగ్రతలు భారీగా పతనం
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లా గజగజ వణుకుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మడకశిరతో పాటు హిందూపురం, కదిరి, కళ్యాణ దుర్గం, రాయదుర్గం, రాప్తాడు, పెనుకొండ, ఉరవకొండ నియోజకవర్గాల్లో చలి ప్రభావం తీవ్రస్థాయిలో ఉంది. శనివారం మడకశిరలో 7.7 డిగ్రీల కనిష్టం నమోదు కావడం చలితీవ్రతకు అద్దం పడుతోంది. ఉదయం 8 గంటల వరకు రహదారులను మంచుతెరలు కమ్మేస్తున్నాయి. రాత్రిళ్లు పొగమంచు ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 27 నుంచి 33 డిగ్రీల మధ్య నమోదవుతుండగా కనిష్ట ఉష్ణోగ్రతలు 9 నుంచి 14 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. మడకశిర తర్వాత కుందుర్పిలో 9.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే, తనకల్లు 9.3 డిగ్రీలు, సోమందేపల్లి 9.6, నల్లమాడ 9.7, రొద్దం 9.9, బెళుగుప్ప 10, లేపాక్షి 10.1, నల్లచెరువు, చిలమత్తూరు 10.4, బుక్కపట్నం 10.5, వజ్రకరూరు, ఓడీ చెరువు 10.6, పరిగి 10.7, కనగానపల్లి 10.8 డిగ్రీలతో పాటు చాలా ప్రాంతాల్లో 11 డిగ్రీల లోపు కనిష్టం నమోదు కావడం గమనార్హం. చలి నుంచి రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
పెరగనున్న ‘చలి’
బుక్కరాయసముద్రం: జిల్లాలో రానున్న 5 రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరగనున్నట్లు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ శంకర్‌బాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వర్ష సూచన ఏమీ లేదన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 30.5–31.0, రాత్రి ఉష్ణోగ్రతలు 16.0–17.4 డిగ్రీల సెల్సియస్ నమోదు కావచ్చన్నారు. గాలిలో తేమ శాతం ఉదయం 78–89, మధ్యాహ్నం 30–40 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment