టీడీపీ కార్యకర్తల దాడి
తాడిపత్రి రూరల్: మండలంలోని గంగాదేవిపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు మాధవపై అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు గురువారం కట్టెలతో దాడి చేశారు. బాధితుడు తెలిపిన మేరకు... పాల వ్యాపారంతో జీవనం సాగిస్తున్న మాధవ... గ్రామంలో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉండేవాడు. ఈ అంశం నచ్చని టీడీపీ కార్యకర్తలు ప్రతాపరెడ్డి, రామాంజులరెడ్డి, చింతకుంట రామాంజులరెడ్డి, జయరామిరెడ్డి గురువారం ఉదయం జేసీబీని అడ్డుగా పెట్టి పొలం నుంచి వస్తున్న మాధవపై దాడి చేశారు. గాయపడిన బాధితుడు.. తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకుని రూరల్ అప్‌గ్రేడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment