అధిక వడ్డీ ఆశ చూపి.. నిండా ముంచి
కళ్యాణదుర్గం రూరల్: అధిక వడ్డీ ఆశ చూపి నిండా ముంచారు ఘరానా అన్నాతమ్ముళ్లు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. వివరాలు.. కళ్యాణదుర్గం మండలంలోని బాల వెంకటాపురం గ్రామానికి చెందిన ఖాసీం వలి, ఇమామ్ వలి అన్నాతమ్ముళ్లు. అదే గ్రామానికి చెందిన దాదాపు 150 మందికి అధిక వడ్డీ ఆశ చూపి రూ.5 కోట్ల అప్పు తీసుకున్నారు. మొదట్లో ఇచ్చిన అప్పును చెప్పినట్లుగానే చెల్లించడంతో చాలా మంది డబ్బు సమర్పించుకున్నారు. ఈ క్రమంలోనే నాలుగు నెలల క్రితం ఖాసీం వలి, ఇమామ్ వలీలు తమ కుటుంబసభ్యులతో కలిసి అనంతపురానికి మకాం మార్చారు. అప్పు ఇచ్చిన వారందరికీ ఐపీ నోటీసులు పంపారు. దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ ఆదివారం కళ్యాణదుర్గం రూరల్ పోలీసుస్టేషన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ఇచ్చిన సొమ్ముతో ఖాసీం, ఇమామ్‌లు 2 కేజీల వరకూ బంగారం, అనంతపురంలో ఇళ్లు, ఫ్లాట్లు కొన్నారని వాపోయారు. అప్పు ఇచ్చిన వారిలో అఽధిక శాతం రైతులు, గొర్రెల కాపరులు, డ్వాక్రా మహిళలు, కూలీలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులే తమకు న్యాయం చేయాలని కోరారు.
రూ. 5 కోట్ల అప్పులు చేసి
ఉడాయించిన అన్నాతమ్ముడు
ఏకంగా 150 మందికి కుచ్చుటోపీ
Comments
Please login to add a commentAdd a comment