దాణా పంపిణీ చేయాలి
వరి మళ్లను యంత్రాలతో కోత కోస్తున్నారు. దీంతో గ్రాసం కొరత తలెత్తుతోంది. వేసవిలో మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. గత ప్రభుత్వంలో పంపిణీ చేసిన టీఎంఆర్ సమీకృత దాణా రైతులకు ఎంతో ఉపయోగపడింది. చంద్రబాబు ప్రభుత్వం కూడా స్పందించి దాణా పంపిణీ చేయాలి. – నాగేంద్రప్ప,
కలుగోడు, గుమ్మఘట్ట మండలం
గడ్డి విత్తనాలు సరఫరా చేయాలి
పశుసంవర్ధక, ఉపాధి పథకం ద్వారా అర్హత కలిగిన రైతులందరికీ వంద శాతం రాయితీతో గడ్డి విత్తనాలు అందించాలి. ఇప్పటి నుంచి పెంచితేనే వేసవిలో గ్రాసం కష్టాల నుంచి కొంత వరకైనా గట్టెక్కవచ్చు. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలి.
– గొల్ల నాగరాజు, రైతు, కేపీదొడ్డి
Comments
Please login to add a commentAdd a comment