చేదు జ్ఞాపకాలు మిగిల్చిన 2024
జిల్లాలో ఈ ఏడాది జరిగిన పలు ఘోర రోడ్డు ప్రమాదాలు దిగ్భ్రాంతి కలిగించాయి. నవంబర్ 24న గార్లదిన్నె సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై ఆటోను బస్సు ఢీకొనగా.. ఎనిమిది మంది వ్యవసాయ కూలీలు మరణించిన ఘటన జిల్లాలో విషాదం నింపింది. అలాగే తాడిపత్రికి ‘సంకీర్తన’కు వెళ్లి వస్తూ ఆరుగురు ఇస్కాన్ భక్తులు రోడ్డుప్రమాదంలో మరణించిన ఘటన కలచివేసింది. అక్టోబర్ 27న శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద చోటుచేసుకున్న ఈ దుర్ఘటన అయిన వారికి తీరని శోకం నింపింది. అలాగే సెప్టెంబర్ 22న బుక్కరాయ సముద్రం మండల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు స్నేహితుల మృత్యువాత, మే 18న గుత్తి జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందడం, ఆగస్టు 21న తాడిపత్రి సమీపంలో వంగనూరు వద్ద లారీ, కారు ఢీ కొనడంతో ముగ్గురు దుర్మరణం పాలవడం, నవంబర్ 30న విడపనకల్లు వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు డాక్టర్లు మృతి చెందడం వంటి ఘటనలు అందరినీ షాక్‌కు గురి చేశాయి.
శింగనమల మండలం
నాయనపల్లిక్రాస్ వద్ద కారును ఢీకొన్న లారీ (ఫైల్)
రక్తమోడిన రహదారులు..
Comments
Please login to add a commentAdd a comment