అనంతపురం ఎడ్యుకేషన్: రాప్తాడు మోడల్ స్కూల్‌లో జనవరి 3న జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు (సైన్స్‌ఫేర్) నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్‌బాబు, జిల్లా సైన్స్ అధికారి బాలమురళీకృష్ణ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ యాజమాన్యాల ఉన్నత పాఠశాలల 8,9,10 తరగతుల విద్యార్థులు సైన్స్, గణితానికి సంబంధించి వివిధ ప్రాజెక్ట్‌లను ప్రదర్శించనున్నారని వెల్లడించారు. 2న మండలస్థాయిలో సైన్స్‌ఫేర్ నిర్వహించాలని సూచించారు. మండలస్థాయికి ప్రతి పాఠశాల నుంచి మూడు విభాగాల్లో (ఒకరు, గ్రూపు, టీచర్స్ కేటగిరి) ప్రాజెక్ట్‌లు ప్రదర్శించాల్సి ఉంటుందన్నారు. ప్రతి మండలం నుంచి మూడు విభాగాల్లో ఒక్కో ప్రాజెక్ట్‌ను జిల్లాస్థాయికి ఎంపిక చేసి పంపాలని ఆదేశించారు. కొత్తకొత్త ఆవిష్కరణలు, ఆలోచనలకు అద్దంపట్టేలా ప్రాజెక్ట్‌లు తయారు చేసేలా సైన్స్, గణితం టీచర్లు చొరవ తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల కేటగిరీల నుంచి ఆశించిన స్థాయిలో ప్రాజెక్ట్‌లు వస్తున్నా, టీచర్ల కేటగిరీ నుంచి మరి ఏమాత్రం భాగస్వామ్యం ఉంటుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment