●గం‘జాయ్’
కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలో గంజాయి వినియోగం విపరీతంగా పెరిగింది. ఇంజినీరింగ్, ఫార్మసీ విద్యార్థులనే లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్నారు. ఇటీవల 10 మంది గంజాయి విక్రేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. 18 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు గంజాయి సేవిస్తున్నారనే సమాచారంతో పట్టుకుని కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. ఇప్పటి దాకా 15 కేసుల్లో 63 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం 60 కేజీల గంజాయిని సీజ్ చేయడం గమనార్హం.
●పురివిప్పిన జూదం..
జిల్లాలో పేకాట, మట్కా శిబిరాలు భారీగా వెలిశాయి. నిర్వాహకులు వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారం చేరవేసుకుంటూ ఎక్కడికక్కడ జూద శిబిరాలు నడుపుతున్నారు. మట్కా, పేకాటకు సంబంధించి పోలీసులు మొత్తం 1,192 కేసులు నమోదు చేసి.. 3,250 మందిని అరెస్ట్ చేశారు. రూ.1.98 కోట్లు సీజ్ చేశారు. అయినప్పటికీ జూదాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి.
●సైబర్ నేరగాళ్ల సవాల్..
ఈ ఏడాది సైబర్ నేరగాళ్లు అందినకాడికి దోచుకున్నారు. కొందరి అత్యాశను అనుకూలంగా మార్చుకున్నారు. ఖాతాలను ఖాళీ చేశారు. గతేడాది సైబర్ నేరాలు 40 నమోదు కాగా, ఈ ఏడాది కూడా అదే స్థాయిలో నమోదు కావడం గమనార్హం. గతేడాది రూ.1.45 కోట్లు పోగొట్టుకోగా, ఈ ఏడాది రూ.1.76 కోట్లు నష్టపోయారు.
Comments
Please login to add a commentAdd a comment