పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
అనంతపురం కార్పొరేషన్: క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా కృషి చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. నగరంలోని ‘అనంత’ నివాసంలో బుధవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, పెద్ద సంఖ్యలో తరలివచ్చి ‘అనంత’కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రజలకు చేసిన మేలును వివరించాలన్నారు. కూటమి సర్కారు వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. వేడుకల్లో వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్ కాగజ్‌ఘర్ రిజ్వాన్, టాస్క్‌ఫోర్స్ సభ్యులు రమేష్‌గౌడ్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ్రెడ్డి ప్రకాష్‌రెడ్డి, జేసీఎస్ జిల్లా కో ఆర్డినేటర్ వెన్నం శివరామిరెడ్డి, పార్టీ నగరాధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, నగరాధ్యక్షురాలు కృష్ణవేణి, అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు సాకే చంద్ర, ఓబిరెడ్డి, సైఫుల్లాబేగ్, అమర్‌నాథ్ రెడ్డి, చంద్రశేఖర్ యాదవ్, నరసింహులు, శ్రీదేవి, శ్రీనివాస్‌రెడ్డి, బాకే హబీబుల్లా, వైఎస్సార్ సీపీ నాయకులు తోపుదుర్తి భాస్కర్ రెడ్డి, ఆలమూరు శ్రీనివాస్ రెడ్డి, గౌస్‌బేగ్, రాధాకృష్ణ, శోభారాణి, శోభాబాయి, భారతి, కార్పొరేటర్లు తదితరులు ఉన్నారు.
శ్రేణులకు వైఎస్సార్ సీపీ జిల్లా
అధ్యక్షుడు ‘అనంత’ పిలుపు
ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
Comments
Please login to add a commentAdd a comment