డివిజన్‌ను అభివృద్ధి పథంలో నడుపుతా
● నూతన డీఆర్‌ఎం సీఎస్ గుప్తా
గుంతకల్లు:అందరి సహకరంతో గుంతకల్లు రైల్వే డివిజన్‌ను అభి వృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తానని నూతన డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్తా పేర్కొన్నారు. గుంతకల్లు రైల్వే డివి జనల్ మేనేజర్‌గా బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏడీఆర్‌ఎం సుధాకర్, సీనియర్ డీసీఎం మనోజ్, సీనియర్ డీపీఓ క్యాప్రిల్ ఆరోరా, ఇతర విభాగాల అధికారులు మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి నూతన సంవత్సర శుభాంకాక్షలు తెలిపారు. అదేవిధంగా రైల్వేకార్మిక సంఘాల నాయకులు శాలువతో సన్మానించి స్వాగతం పలికారు. అనంతరం వివిధ విభాగాల అధికారులతో డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్తా సమావేశమయ్యారు. డివిజన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ప్రయాణికుల భద్రతతోపాటు ప్రమాదాల నివారణకు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు.
దయనీయం.. దుర్భరం
అనంతపురం మెడికల్: అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో రోజు రోజుకూ పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. రోగులకు మెరుగైన సేవలు గగనమవుతున్నాయి. నడవలేని స్థితిలో ఆస్పత్రికి వచ్చే రోగుల కోసం ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓలను అందుబాటులో ఉంచి స్ట్రెచర్, వీల్‌చైర్‌పై తీసుకెళ్లాల్సి ఉంది. అయితే, రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్లు నిద్రమత్తులో ఉండటంతో ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓలు ఎక్కడా కానరావడం లేదు. దీంతో రోగులను వారి బంధువులే అవస్థలు పడుతూ వార్డులకు తీసుకెళ్లాల్సి వస్తోంది. నడవలేని స్థితిలో ఉన్న కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన చాంద్‌బాషాను సర్వజనాస్పత్రిలో డాక్టర్లకు చూపించేందుకు కుటుంబసభ్యులు బుధవారం ఆటోలో తీసుకొచ్చారు. అయితే, ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓలు పత్తా లేకపోవడంతో రోగి భార్య మహబూబ్ జాన్, కుమార్తెలు ముబీనా, సాదక్ బీలే అతడిని ఎత్తుకుని వార్డు వరకూ తీసుకెళ్లారు. ఇప్పటికై నా ఆర్‌ఎంఓలు మేలుకుని తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.
ఇంటర్ విద్యార్థిని
అనుమానాస్పద మృతి
రాప్తాడురూరల్: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన అనంతపురంలో బుధవారం జరిగింది. రూరల్ పోలీసులు తెలిపిన మేరకు... విడపనకల్లు మండలానికి చెందిన విద్యార్థిని అనంతపురం శివారులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. బాలికకు తల్లిదండ్రులు లేరు. ఆర్డీటీ సహకారంతో విద్య నభ్యసిస్తోంది. బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో డైనింగ్‌హాలు వద్ద ఉరి వేసుకున్న స్థితిలో కనిపించింది. సమాచారం అందుకున్న సీఐ శేఖర్ ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం సర్వజనాస్పత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సత్యసాయి శత జయంతి వేడుకల లోగో ఆవిష్కరణ
ప్రశాంతి నిలయం: ఈ ఏడాది నవంబర్‌లో జరిగే సత్యసాయి శతజయంతి వేడుకలకు సంబంధించి సత్యసాయి మీడియా సెంటర్ రూపొందించిన ప్రత్యేక లోగోను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్‌రాజు, సభ్యులు బుధవారం ఆవిష్కరించారు. సాయంత్రం సత్యసాయి మహాసమాధి చెంత ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ చైర్మన్ చక్రవర్తి, వైస్ చైర్మన్ నిమిష్ పాండ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా శతజయంతి వేడుకల థీమ్ సాంగ్‌ను డిజిటల్ స్క్రీన్‌పై ప్రదర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment