వైభవంగా పెద్దమ్మ దేవర
పుట్లూరు: మండలంలోని కడవకల్లు గ్రామంలో పెద్దమ్మ దేవర ఆదివారం వైభవంగా నిర్వహించారు. శనివారం రాత్రి నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. గ్రామంలో 13 ఏళ్ల తర్వాత నిర్వహించిన దేవర కావడంతో ప్రతి ఇంటా రెండు నుంచి 10 పొట్టేళ్ల వరకు అమ్మవారికి మొక్కుబడి కింద బలి ఇచ్చారు. బంధుమిత్రులకు విందు ఏర్పాటు చేశారు. దీంతో ఆదివారం కడవకల్లు గ్రామం జనసంద్రమైంది. పలు రాజకీయ పార్టీల నాయకులు దేవర మహోత్సవానికి హాజరైయ్యారు.
నేడు చౌడేశ్వరీ జ్యోతుల మహోత్సవం..
పెద్దమ్మ దేవర మహోత్సవంలో భాగంగా సోమవారం చౌడేశ్వరీ జ్యోతుల ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు గ్రామ పెద్దలు ఆదివారం వెల్లడించారు. గ్రామంలోని చౌడేశ్వరీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతుల ఊరేగింపు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment