సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మైండ్ పాడైపోయిందని.. ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడంలేదని ప్రముఖ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదాపై పదేపదే మాట మార్చిన వ్యక్తి చంద్రబాబు అని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. మామకు వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీలో కూర్చొన్న వారే ఫేక్ సీఎం అని విమర్శించారు. వైఎస్ జగన్ ప్రజల్లో అభిమానం సంపాదించుకుని సీఎం అయ్యారన్నారు. చంద్రబాబు సొంత తమ్ముడిని కూడా మోసం చేశారని దుయ్యబట్టారు.
‘‘ఎమ్మార్వో వనజాక్షిపై దాడి జరిగితే కనీసం ఫిర్యాదు కూడా చేయనివ్వలేదు. చంద్రబాబు అధికారంలో ఉండగా బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపారు. చంద్రబాబు రౌడీ రాజ్యాంగానికి ఇవన్నీ ఉదాహరణలే. పులివెందులలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో ప్రత్యక్షంగా చూడాలి. పేదలకు ఉచితంగా విద్యా, వైద్యం అందిస్తున్నారని’’ పోసాని పేర్కొన్నారు.
చదవండి:
ప్రజలపై అక్కసు.. చంద్రబాబు శాపనార్థాలు
చంద్రబాబు పాలనంతా దోపిడీయే: మంత్రి బొత్స
Comments
Please login to add a commentAdd a comment