తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన నవంబర్ నెల కోటాను ఈ నెల 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎల్రక్టానిక్ డిప్ కోసం ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆ¯న్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారిలో ఈ నెల 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను, అదేవిధంగా నవంబర్ 9న శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పుష్పయాగం సేవ టికెట్లను ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. అలాగే వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన నవంబర్ నెల కోటాను ఈ నెల 22న మధ్యాహ్నం మూడు గంటలకు, అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఈ నెల 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు టికెట్ల కోటాను ఉదయం 11 గంటలకు, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా నవంబర్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు, తిరుమల, తిరుపతిలో గదుల కోటాను మధ్యాహ్నం మూడు గంటలకు, తిరుమల–తిరుపతి శ్రీవారి సేవ కోటాను ఈ నెల 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ కోటాను మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ కోటాను మధ్యాహ్నం ఒంటి
గంటకు ఆ¯Œన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment