![నందలూరు రైల్వేస్టేషన్‌ను పరిశీలిస్తున్న
ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/8/07rjpt03-170002_mr.jpg.webp?itok=yHzgM0vj)
నందలూరు రైల్వేస్టేషన్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి
నందలూరు(రాజంపేట) : నందలూరు రైల్వే పూర్వ వైభవానికి తన వంతు కృషి చేస్తానని, త్వరలో ఎంపీ మిధున్‌రెడ్డితో కలిసి రైల్వేకేంద్రం పరిశీలన ఉంటుందని ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తెలిపారు. శుక్రవారం ఎంపీపీ మేడా విజయభాస్కర్‌రెడ్డి, నాగిరెడ్డిపల్లె అర్బన్ సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆహ్వానం మేరకు నందలూరు రైల్వేస్టేషన్ ఏరియా, బ్రిటిషు కాలం నాటి స్టీమ్ ఇంజన్‌లోకోషెడ్ దుస్థితిని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నందలూరు రైల్వేకి ఎంతో ఘన చరిత్ర ఉందన్నారు. నందలూరులో రైళ్లు ఆపాలంటే అనేక కారణాలు ఉన్నతాధికారులు చూపుతున్నారన్నారు. ఇక్కడ అన్ని రకాల మౌలిక వసతులు, కావాలసిన భూములు, రెడిమేడ్ క్వార్టర్స్ ఉన్నాయన్నారు. మూతపడిన లోకోషెడ్ స్థాఽనంలో ప్రత్యామ్నాయ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని పదేళ్ల కిందట రాజ్యసభలో హామీ ఇచ్చారన్నారు. నందలూరులో రైళ్ల నిలుపుదలతోపాటు క్రూ సెంటర్ తరలిపోకుండా, కోవిడ్ ముందు ఏ రైళ్లకు హాల్టింగ్ ఉన్నాయో వాటిని పునరుద్ధరించాలన్నారు. తాను, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి కలిసి ఎంపీ మిథున్‌రెడ్డికి వివరిస్తామన్నారు. ఎంపీతో కలిసి రైల్వేబోర్డు అధికారులను కలిసి మాట్లాడుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గడికోట ఉషాసుబ్బారెడ్డి, జిల్లా వక్ఫ్‌బోర్డు సెక్రటరీ సయ్యద్‌అమీర్, మండల ఉపాధ్యక్షుడు నాయనపల్లె అనుదీప్, సౌమ్యనాథాలయ మాజీ చైర్మన్ అరిగెల సౌమిత్రి, ఏజీపీ షమీ, మండల కో–ఆప్షన్ సభ్యుడు కలీం, మైనార్టీ నేత నవాబ్, నాయకులు ఆర్మగం విశ్వనాథ్, గుణయాదవ్, ఆకేపాటి రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment