రసవత్తరంగా సాగుతున్న రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు
కడప స్పోర్ట్స్ : కడప నగరంలోని డీఎస్‌ఏ క్రీడా మైదానం వేదికగా ఏపీ హ్యాండ్‌బాల్ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళలు, అండర్–19 బాలుర విభాగం చాంపియన్‌షిప్ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారులు చక్కటి ఆటతీరు కనబరిచారు. జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. చిన్నపరెడ్డి, తిరుమల టింబర్ డిపో అధినేత కంచి గోపీకృష్ణ, కంచి సురేంద్రనాథ్ క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంచి సురేంద్రనాథ్, వి.వి. శివప్రసాద్, వెంకట సునీల్, ఎ. సింధూరి, బాబర్, బసిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రసవత్తరంగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు..
హ్యాండ్‌బాల్ అండర్–19 విభాగంలో నిర్వహించిన మ్యాచ్‌లలో కడప జట్టు తూర్పుగోదావరి జట్టుపై, పశ్చిమగోదావరి జట్టు శ్రీకాకుళంపై, శ్రీకాకుళం జట్టు తూర్పుగోదావరిపై, పశ్చిమగోదావరి జట్టు కడపపై, చిత్తూరు జట్టు ప్రకాశంపై, వైజాగ్ జట్టు కృష్ణాపై, విజయనగరం జట్టు కర్నూలుపై విజయం సాధించాయి. అనంతరం నిర్వహించిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విజయనగరం జట్టు గుంటూరుపై విజయం సాధించి సెమీ ఫైనల్‌కు చేరింది.
● సీనియర్ మహిళల విభాగంలో నిర్వహించిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లలో విజయనగరంపై కృష్ణా జట్లు, కడప జట్టు తూర్పుగోదావరిపై, వైజాగ్ జట్టు చిత్తూరుపై విజయం సాధించి సెమీ ఫైనల్‌కు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment