అసాంఘిక నేరాల అదుపునకు సీసీ కెమెరాలు ఏర్పాటు
రాయచోటి: అసాంఘిక నేరాల అదుపుకోసం సాంకేతికత ఆధారంగా జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. నిఘా వ్యవస్థను మెరుగుపరచడం, జిల్లాలో నేరాలను అదుపు చేయడానికి, ప్రజల భద్రతను మెరుగుపరచడానికి సీసీ కెమెరాల వ్యవస్థను ఏర్పాటుకు సన్నాహాలు చేయాలన్నారు. వీటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించవచ్చాన్నారు. జిల్లాలోని ముఖ్య కూడళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, హైవేలు, ప్రార్థనా మందిరాలు, కళాశాలలు తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారన్నారు. సమావేశంలో ప్రాజెక్టు ప్రణాళిక అమలు, భవిష్యత్తు గురించి చర్చించారు. సీసీ కెమెరాల ఏర్పాటులో వేగం, నాణ్యతను మెరుగుపరచాలన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ సామర్థ్యాన్ని పెంచనున్నట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా అదునపు ఎస్పీ యు వెంకటాద్రి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్లు, సోషల్ మీడియా ఇన్‌స్పెక్టర్, సైబర్ క్రైమ్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్, డిసిఆర్‌బి ఇన్‌స్పెక్టర్, ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐలు, కమ్యునికేషన్ సిబ్బంది, ఐటి కోర్ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు.
● ఎస్పీ విద్యాసాగర్ నాయుడు
Comments
Please login to add a commentAdd a comment