అశ్వవాహనంపై అనంతమూర్తి | - | Sakshi
Sakshi News home page

అశ్వవాహనంపై అనంతమూర్తి

Published Thu, Feb 6 2025 12:21 AM | Last Updated on Thu, Feb 6 2025 12:22 AM

అశ్వవ

అశ్వవాహనంపై అనంతమూర్తి

కడప కల్చరల్‌ : దుష్ట సంహారం చేసేందుకు ఆయన ఖడ్గం చేతబూనాడు. ఉరకలేస్తున్న సమరోత్సాహంతో ఉత్తమ అశ్వంపై వేటకు బయలుదేరాడు. ఆ వీర గంభీర రూపం శత్రువులకు చూడగానే దడపుట్టించేలా ఉంది. దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం స్వామిని సర్వభూపాల వాహనంలో కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయ ఇన్‌స్పెక్టర్‌ ఈశ్వర్‌రెడ్డి, టీటీడీ సూపరింటెండెంట్‌ హనుమంతయ్య ఆధ్వర్యంలో అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం ఉల్లాసభరితంగా ఊయల సేవను నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారు రాత్రి కనుల పండువగా అలంకరించిన అశ్వవాహనంపై స్వామిని మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు ఆ దివ్య మంగళ స్వరూపాన్ని కనులారా తిలకించి పూజా ద్రవ్యాలు సమర్పించి మంగళ హారతులు, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

నేడు చక్రస్నానం

దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం దేవునికడప మాడవీధుల్లో భక్తులు, ఆలయ నిర్వాహకులు, అర్చక బృందాలు వసంతోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఆలయం ఎదుట గల పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పుష్కరిణిలో స్వామి, అమ్మవార్లకు అవభృథస్నానము నిర్వహింపజేస్తారు. సాయంత్రం 6.30 గంటలకు యథావిధిగా ఊంజల్‌ సేవ, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల భక్తిగీతాలాపనలు ఉంటాయి. రాత్రి హంస వాహనంపై స్వామిని మాడవీధుల్లో ఊరేగిస్తారు. 8 నుంచి 9.00 గంటల్లోపుగా ధ్వజావరోహణం చేస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అశ్వవాహనంపై అనంతమూర్తి 1
1/1

అశ్వవాహనంపై అనంతమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement