కడప కోటిరెడ్డిసర్కిల్: తిరుపతి నుంచి వైఎస్సార్ జిల్లా మీదుగా కుంభమేళాకు రెండు ప్రత్యేకరైళ్లు నడపనున్నారని కడపరైల్వే కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. 07117 నంబరుగల తిరుపతి–ధనాపూర్ రైలు ఈనెల 14న, 18న 07119 నంబరుగల రైలు తిరుపతిలో బయలుదేరుతాయన్నారు. .తిరుగు ప్రయాణంలో ధనపూర్‌లో 07118 నంబరుగలరైలు ఈనెల 17న, అలాగే 07120 నంబరుల రైలు ఈనెల 21న రైలు బయలుదేరుతాయన్నారు. ఈ రైలు తిరుపతి, రేణిగుంట, కోడూరు, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తా డిపత్రి, గుత్తి, డోన్, కర్నూలు, మహబూబ్‌నగర్, కాచిగూడ, మల్కాజ్‌గిరి, మౌలాలి, ఖాజీపేట జంక్షన్, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సి ర్పూర్, కాగజ్‌నగర్, బల్లాశ్సా, చంద్రాపూర్, నాగపూ ర్, హిటార్సి, జబల్‌పూర్, ప్రయాగరాజ్, మీరజ్‌పూర్‌మీదుగా ధనాపూర్‌కు చేరుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment