![8 వరక](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/05rct103f-170075_mr-1738781229-0.jpg.webp?itok=YEf2CtcM)
8 వరకు దరఖాస్తుల స్వీకరణ
రాయచోటి టౌన్: రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన గీత కులాల మద్యం దుకాణాలకు ఈ నెల 8 లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి జి. మధుసూదన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.అలాగే దుకాణాలకు సంబంధించి ఈ నెల 10వ తేదీ కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో డ్రా తీయనున్నట్లు ఆయన చెప్పారు. ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
టీ–20, వన్డే టోర్నీకి ఎంపిక
నందలూరు: బోర్డు ఆఫ్ డిసేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఈనెల 14 నుంచి 18వ తేదీ వరకు నేపాల్‌లో జరగబోయే టీ–20, వన్డే టోర్నీలకు ఆంధ్రరాష్ట్రం నుంచి భారత జట్టుకు నందలూరుకు చెందిన శివకోటి ఎంపికయ్యారు. బుధవారం శివకోటి ఈ విషయాన్ని విలేకరులకు తెలిపారు. తన ఎంపికకు సహకరించిన బోర్డు ఆఫ్ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఇండియా, స్థానిక నందలూరు సబ్ సెంటర్ వారికి, సహాయ సహకారాలు అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
హోరాహోరీగా క్రీడా పోటీలు
రైల్వేకోడూరు అర్బన్: రైల్వేకోడూరు డాక్టర్ వైస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో అంతర్ కళాశాలల రాష్ట్రస్థాయి 11వ క్రీడా, సాస్కృతిక పోటీలు జరిగాయి. అన్ని విభాగాల్లో విద్యార్థులు గట్టి పోటీ ఇస్తుండడంతో రసవత్తరంగా జరుగుతున్నాయి. బుధవారం రన్నింగ్, కబడ్డీ, హైజంప్, త్రోబాల్, క్లే మాడలింగ్ (మట్టితో ఆకృతులు), వక్తృత్వ పోటీలు నిర్వహించారు. పరుగుందెంలో అనంతరాజుపేట, రామన్నగూడెం విద్యార్థులు ప్రథమ స్థానం సాధించారు. కబడ్డీ, డిస్కస్‌త్రోలో అనంతరాజుపేట యూనివర్సిటీ విద్యార్థులు ప్రథమస్థానంలో నిలిచారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్ శ్రీనివాసులు, అధికారులు పాల్గొన్నారు.
నేడు బాస్కెట్ బాల్ ఎంపికలు
కడప ఎడ్యుకేషన్: జిల్లా బాస్కెట్‌బాల్ అసో సియేషన్ ఆధ్వర్యంలో గురువారం బాలబాలికల బాస్కెల్‌బాల్ ఎంపికలు జరుగుతాయని బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సహదేవరెడ్డి తెలిపారు. ఇందులో బాలురకు వేంపల్లి చైతన్య హైస్కూల్లో , అలాగే బాలికలకు కడప నగరం జయనగర్‌కాలనీలోని జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి యూత్ బాలబాలికల బాస్కెట్ బాల్ ఎంపికలు నిర్వహించబడతాయని తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే బాలబాలికలు జనవరి 1వ తేదీ 2009 తర్వాత పుట్టిన వారై ఉండాలని తెలిపారు. బాస్కెట్‌బాల్ ఎంపికలకు హాజరగు బాలబాలికలు తప్పని సరిగా ఒరిజినల్ ఆధార్‌కార్డుతో రావాలని సూచించారు. జిల్లాస్థాయి పోటీలలో ఎంపికై న బాలిబాలికలకు 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 8వ రాష్ట్రస్థాయి యూత్ బాస్కెట్ బాల్ టోర్నమెంట్ రాజమండ్రి జిల్లా పిఠాపురంలో ఆడాల్సి ఉంటుందని సహదేవరెడ్డి తెలిపారు.
పది ఫలితాల్లో జిల్లాను
ప్రథమస్థానంలో నిలపాలి
రాయచోటి అర్బన్: పదోతరగతి పరీక్షా ఫలితాల్లో రాష్ట్రంలోనే అన్నమయ్య జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలని కడప డీఆర్‌ఓ మధుసూదన్ పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని పీసీఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాల్‌లో జిల్లాస్థాయి ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డీఈఓతో కలసి ఆయన 10వ తరగతి ఉర్దూమీడియం స్టడీమెటీరియల్‌ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రథమంగా 10వ తరగతి ఉర్దూ మీడియం మెటీరియల్‌ను తయారు చేశారని చెప్పారు. మెటీరియల్ తయారు చేసిన నిపుణులను ఆయన అభినందించారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. జిల్లా విద్యాశా ఖాధికారి సుబ్రమణ్యం మాట్లాడుతూ 3 సంవత్సరాలుగా జిల్లాలో విద్యార్థులు సాధించిన 10వ తరగతి పరీక్ష ఫలితాల గురించి వివరించారు. ఈసారి మెరుగ్గా ఎలా రాబట్టాలనే అంశంపై హెచ్‌ఎంలకు దిశా నిర్దేశం చేశారు. డి ప్యూటీ డీఈఓ శివప్రకాష్‌రెడ్డి, విషయ నిపుణులు మహమ్మద్ హాషిం, షేక్ జాఫరుద్దీన్, ఇలియాస్‌బాషా,సయ్యద్ రహిమాన్, హాజిరాబాను, ఇమ్రోజ్ అలీఖాన్, హెచ్‌ఎంలు నరసింహారెడ్డి, శి వారెడ్డి,జనార్దన్‌రెడ్డి, మున్వర్‌బాష పాల్గొన్నారు.
![8 వరకు దరఖాస్తుల స్వీకరణ 1](https://www.sakshi.com/gallery_images/2025/02/6/05rkd412a-170072_mr-1738781229-1.jpg)
8 వరకు దరఖాస్తుల స్వీకరణ
![8 వరకు దరఖాస్తుల స్వీకరణ 2](https://www.sakshi.com/gallery_images/2025/02/6/05rjpt504-170099_mr-1738781229-2.jpg)
8 వరకు దరఖాస్తుల స్వీకరణ
Comments
Please login to add a commentAdd a comment