![మాసాంతంలోగా పనులు పూర్తి చేయాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/05rct01-170022_mr-1738781231-0.jpg.webp?itok=PPJj5Vza)
మాసాంతంలోగా పనులు పూర్తి చేయాలి
రాయచోటి: జిల్లాలో రూ. 100 కోట్ల అంచనాతో చేపట్టిన పల్లె పండుగ పనులను ఈ మాసాంతంలోగా వందశాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ సంబధిత అధికారులను ఆదేశించారు. బుధవారం రాయచోటి కలెక్టరేట్ హాల్‌నుంచి పల్లె పండుగ పనులు, ఇండ్ల పనులు, ఇండ్ల నిర్మా’ప్రగతిపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఒలు, మండల స్థాయి ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి తీసుకొవాల్సిన చర్యలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రగతిలో వెనుకబడిన కోడూరు, రాజంపేట, తంబళ్లపల్లి, మొకలకల చెరువు, బి కొత్తపేట తదితర మండలాల అధికారులతో సమీక్షించి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ప్రగతి సాధనకు తగు సూచనలు జారీ చేశారు. సమావేశంలో పంచాయతీరాజ్, హౌసింగ్, డిఆర్‌డీఎ, జిఎస్‌డబ్ల్యుఎస్ జిల్లా అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, ఎంపీడీఓలు, మండల ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment