వైఎస్సార్‌సీపీ నాయకులే టార్గెట్
అభివృద్ధికి ఆటంకం
జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గంలో మండల పరిషత్ పరిధిలో జరిగే సర్వసభ్య సమావేశాలనుకూటమి శ్రేణులు అడ్డుకుంటుండడం ఆందోళన కలిగించే పరిణామం. అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలు రూపొందించడంతోపాటు మండలపరిధిలో అనేక అంశాలకు సంబంధించి ప్రజాప్రతినిధులు చర్చించడం ఆనవాయితీ. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్‌సీపీకి సంబంధించిన వారే ప్రజాప్రతినిధులుగా ఉన్నారని సహించలేక నియోజకవర్గ పరిధిలో సమావేశాలుజరగకుండా అడ్డుకుంటుండడంపై చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా జిల్లా వ్యాప్తంగా దాడులుమొదలుకొని ఇతర వ్యవహారాల విషయంలోనూ తమదే పట్టు సాధించాలన్నధోరణితో కూటమి శ్రేణులు వ్య వహారిస్తున్న తీరు సర్వత్రా విస్మయం కలిగిస్తోంది.
● జిల్లాలో అధికార పార్టీ నేతల దాడులు
● అధికారదర్పంతో భయోత్పాతానికిగురి చేస్తున్న వైనం
● ఎప్పుడూ లేని విధంగా అరాచకాలతో కొత్త చరిత్ర
సాక్షి టాస్క్‌ఫోర్స్: సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారంలోకి రాగానే కూటమి నేతలు అరాచకం సృష్టిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏం చేసినా చెల్లుతుందన్న నెపంతో ఇష్టారాజ్యంగా దాడులకు పూనుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కొత్త తరహా ఘటనలు చోటుచేసుకుంటుండడం ఆందోళన కలిగించే పరిణామం. అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం ప్రజాస్వామ్యంలో నూతనంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులు అభివృద్ధితోపాటు ఇతర సంక్షేమానికి పాటుపడేలా కృషి చేస్తూ ఎక్కడికక్కడ సంఘవ్యతిరేక కార్యకలాపాలను నిరోధించాల్సిన బాధ్యత ఉంది. అయితే జిల్లాలో ప్రతిపక్ష పార్టీ నేతలతోపాటు ఆస్తులపై విచక్షణా రహిత దాడులు జరుగుతుండడం ప్రజాస్వామ్య వాదులను సైతం ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల వైఎస్సార్ సీపీ నాయకులపై దాడులు, దౌర్జన్యాలుకూడా చోటుచేసుకుంటున్నాయి. అధికారం అండతో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించారని సాకు చూపుతూ ఆస్తులను సైతం పెకళిస్తుండడం గమనార్హం.
అధికారంలోకి రాగానే వేధింపులు
జిల్లాలో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ఏదో ఒక రకంగా వేధింపులు మొదలయ్యాయి. నయానో, భయానో వారి మార్గంలోకి తెచ్చుకునేందుకు భయపెడుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లతోపాటు పోలీసుల ద్వారా కేసుల నెపాన్ని తీసుకొచ్చి భయపెట్టడం చర్చనీయాంశంగా మారుతోంది. అంతేకాకుండా రెండునెలల కిందట వైఎస్సార్ సీపీ పోస్టుల విషయంలో యాక్టివ్‌గా ఉన్న సోషల్ మీడియా ప్రతినిధులను కూడా అరెస్టు చేయడంతో అందరూ భయపడే పరిస్థితి నెలకొంది. కీలకమైన నాయకులపై పాత కేసులు తిరగదోడే చర్యలకు ఉపక్రమించిన పరిస్థితులు జరిగాయి. అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా ఇసుక సరిహద్దులు దాటిస్తున్నా..మద్యం షాపులకు సంబంధించి ప్రత్యేకంగా పర్మిట్ రూములు లాంటివి పెట్టుకుని నడుపుతున్నా అడిగే వారు లేకపోగా ప్రత్యర్థులు చిన్నపాటి తప్పు చేసినా చర్యలు తీవ్రంగా ఉంటున్నాయి.
అన్నమయ్య జిల్లాలో వైఎస్సార్‌సీపీ నాయకులే టార్గెట్‌గా టీడీపీ శ్రేణులు దౌర్జన్యాలకు తెగబడుతున్నాయి. అధికారం చేపట్టిన అనంతరం ఆగస్టులో గుర్రంకొండ పోలీసుస్టేషన్‌లో వైఎస్సార్‌సీపీ నాయకులను కూర్చొబెట్టారన్న కోపంతో ఏకంగా పోలీసుస్టేషన్ పైకే టీడీపీ శ్రేణులు దాడికి తెగబడ్డాయి. గత సెప్టెంబరుల్లో కేవీ పల్లె జెడ్పీటీసీ సభ్యురాలు గజ్జెల శృతి ఇంటిపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. శృతి, ఆమె భర్త గజ్జెల శ్రీనివాసులురెడ్డి ఇంటిలో లేని సమయంలో స్థానిక టీడీపీ నేతలు బీభత్సం సష్టించారు. జెడ్పీటీసీ ఇంటిపై రాళ్లతో దాడి చేసిన అనంతరం వైఎస్సార్ సీపీ కార్యకర్త తారకనాథరెడ్డిని తీవ్రంగా కొట్టి గాయపరిచి కారులో తీసుకెళ్లి రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారు. రాయచోటి నియోజకవర్గంలో ఇటీవల ప్రత్యర్థులపై దాడులు పెరిగిపో యాయి. అధికారం వచ్చిన మొదట్లోనే కౌన్సిలర్లకు సంబంధించిన ఇళ్ల వద్ద బైకులకు నిప్పుపెట్టారు. ఓ మహిళా కౌన్సిలర్ భర్తపై కత్తులతో దాడి చేశారు. అంతకుముందు బీసీ నాయకుడు, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ వెంకటేష్ ఇంటిపై కూడా దాడి చేశారు. ఇటీవల వైఎస్సార్ సీపీ నేత, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ జల్లా సుదర్శన్‌రెడ్డిపై ఎంపీడీఓపై దాడి చేశారంటూ కేసు నమోదు చేశారు. అలాగే రామాపురంమండలం కొండావాండ్లపల్లెలో వైఎస్సార్ సీపీకి చెందిన ఆదిరెడ్డి ఇల్లు కూల్చివేత, అలాగే రాచపల్లెలో ప్రభుత్వ స్థలంలో ఉందంటూ దుకాణం తొలగింపు లాంటి చర్యలకు అధికారుల ద్వారా చేయించడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. తాజాగా లక్కిరెడ్డిపల్లె మండలం జాండ్రపల్లెలో జెడ్పీటీసీ రమాదేవి, మాజీ ఎంపీపీ రెడ్డెయ్య ఇంటిపై టీడీపీ శ్రేణులు మూకుమ్మడి దాడికి పాల్పడి భయోత్పాతం సష్టించడం లాంటి ఘటనలు వారి అరాచకాలను బహిర్గతం చేస్తున్నాయి. చెన్నముక్కపల్లె పరిధిలోని రాజుల కాలనీలో వైఎస్సార్ సీపీ నేతల పేర్లుగల శిలాఫలకాలను ధ్వంసం చేయడంతోపాటు మంచినీటి శుద్ధి కేంద్రాన్ని ఽతొలగించారు. రైల్వేకోడూరులో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా మసలుతూ ఏకంగా అక్కడ కూడా బస్సు షెల్టర్, బ్రిడ్జి వద్ద శిలాఫలకాలను కూడా అప్పట్లో ధ్వంసం చేశారు. ఇలా కూటమి నేతల విచక్షణా రహిత దాడులపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment