సంఘటనను గురించి తెలుసుకుంటున్న పోలీసులు
చెన్నూరు : చెన్నూరు గాంధీ నగర్‌లో గంజాయి, మద్యం మత్తులో అల్లరిమూకలు పేట్రేగిపోయారు. బీరు బాటిళ్లు, కత్తులతో పరస్పరం దాడి చేసుకోవడంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా.. మంగళవారం సాయంత్రం కొంతమంది యువకులు చెన్నూరు చర్చి ప్రాంతంలో మద్యం సేవించారు. ఇదే సమయంలో ఇరువర్గాలుగా విడిపోయి బీరు సీసాలు, కత్తులతో దాడులు చేసుకున్నారు. అంతేకాకుండా గ్రామంలో కత్తులు పట్టుకొని తిరగడంతో జనం భయభ్రాంతులయ్యారు. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో అల్లరిమూకలు తిష్టవేసి అరాచకం సృష్టిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై ఎస్‌ఐ చిన్న పెద్దయ్య మాట్లాడుతూ గొడవలకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అయితే వారికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించామని తెలిపారు.
బీరు సీసాలు, కత్తులతో స్వైర విహారం
ఇరువురికి తీవ్ర గాయాలు
Comments
Please login to add a commentAdd a comment