సిద్దవటాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
సిద్దవటం: సిద్దవటాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మండల కేంద్రమైన సిద్దవటంలోని మట్లిరాజుల కోటను ఆదివారం సాయంత్రం రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, పర్యాటక అఽధికారులతో కలిసి రాష్ట్ర పర్యాటక, సాస్కృతిక సినిమా టోగ్రపీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సందర్శంచారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లడుతూ చారిత్రక వారసత్వ కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రెండవ శతాబ్దం నాటి మట్లిరాజులు నిర్మించిన అద్భుతమైన కోటలోని శివాలయం, మసీదు, దర్గా, విజయనగరం రాజుల శాలివాహన శకం విజయాభ్యుదయ బండను పరిశీలించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌తో చర్చించి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం పీపీపీ మోడల్‌లో ఇన్‌వెస్టర్లతో ఇటీవలే సమావేశాలను కూడా నిర్వహించామన్నారు. సిద్దవటం కోట చుట్టూ ఉన్న దేవాలయాలను పరరిక్షించి వాటిని అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే ఈ ప్రాంతంలో సఫారీ, బోటింగ్, రెస్టారెంటు, సర్క్యూట్ పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే ఇక్కడికి వచ్చే పర్యాటకులు బస చేసి ఇక్కడి ప్రాంతాలను సందర్శించుకొనే విధంగా అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లాలోని గండికోటకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సహకారం అందించిందని, అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా సహకారాన్ని తీసుకొని ఏకో టూరిజం, టెంపుల్ టూరిజం, వెల్నెస్ టూరిజంను అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లా లోని ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని వాటిని అంచె లంచెలుగా అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా టూరిజం శాఖ అధికారి సురేష్‌కుమార్, జనసేన నాయకులు అతికారి కృష్ణ, తాతంశెట్టి నాగేంద్ర, రెడ్డిరాణి, జిల్లా అధ్యక్షుడు సుంకర శ్రీనివాసులు, రాటాల రామయ్య తదితరులు పాల్గొన్నారు.
చారిత్రక కట్టడాలను పరిరక్షించేందుకు చర్యలు
పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్
Comments
Please login to add a commentAdd a comment