●గోపురం కూల్చేశారు
రంగనాథస్వామి ఆలయం పురావస్తుశాఖ ఆదీనంలో ఉంది. అధికారులు పట్టించుకోని కారణంగానే ఈ విధ్వంసం జరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండపై పాళ్యం విరాజిల్లినట్టుగా సాక్ష్యాలుగా కనిపించిన వారసత్వ రంగనాథస్వామి ఆలయం ఉన్న చోట ప్రస్తుతం శిథిలాలు కనిపిస్తున్నాయి. ఆలయాల్లో గుప్త నిధులున్నట్టు వాటిని దక్కించుకోవడం కోసం ముఠాలు చాలా దారుణంగా వ్యవహరించాయి. 2022 డిసెంబర్ నాటికి ఆలయం కనిపించేది. గర్భగుడి, దానిపై చక్కటి శిల్పకళతో నిర్మించిన గోపురం కనిపించేది. పాళ్యం చరిత్ర తెలిపేలా గోపురంపై శిల్పకళతో వివరించారు. గోపురంపై సింహలు, అమ్మవారి విగ్రహం, పాలిచ్చే ఆవులు బొమ్మలు చెక్కారు. గర్భగుడిని పోడువాటి రాతిబండలతో నిర్మించగా వాటిపై శిల్పాలు, కొన్ని బొమ్మలు చెక్కారు. స్తంభాలపై శ్రీవెంకటేశ్వరుడు, గరుక్మంతుడు, వినాయకుడు, నాటి పాలనకు అద్దంపట్టే చిత్రాలను చెక్కారు. ఏనుగు, నెమలి, గుర్రం, శంఖు, చక్రాలు, వినాయకుడు, హనుమంతుడు, పువ్వులు కనిపిస్తాయి. గర్భగుడిలో నిర్మించిన బండపై శాసనాలు వేయించారు. ఆలయంలో రంగనాథస్వామి విగ్రహం ఏమైందో తెలియదు. గర్భగుడిలో లోతుగా తవ్వేశారు. దానిపైనున్న గోపురం తవ్వకాల దెబ్బకు లేదా అందులో నిధులపై అనుమానంతోనైనా కూల్చేశారు. సుందరమైన ఈ గోపురం శిథిలాలు కుప్పగా పడివున్నాయి. స్తంభాలు, వాటిపై కప్పుగా అమర్చిన రాళ్లను ధ్వంసం చేశారు. ఆలయం మధ్యలో పెద్ద గొయ్యిని తవ్వారు. ఆలయ ముఖద్వారం ద్వారం వద్ద స్తంభాలను ధ్వంసం చేసి లోతైన గొయ్యి తవ్వారు. ఎడమవైపు గోడలు, స్తంభాలు నేలమట్టం అయ్యాయి. చుట్టూ ముళ్లపొదలు నిండిపోయి శిథిలావస్థ కంటే దయనీయమైన దుస్థితిలో రంగనాథస్వామి ఆలయం అనవాళ్లు కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment