నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
రాయచోటి: ప్రజల నుంచి సమస్యలు స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
హార్సిలీహిల్స్‌పై డీఆర్‌ఓ
బి.కొత్తకోట: జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదనరావు ఆదివారం హార్సిలీహిల్స్‌పై పర్యటించా రు. కొండపై పలు ప్రాంతాల్లో పర్యటించి పరిశీలి ంచారు. డీఆర్‌ఓగా బాధ్యతలను చేపట్టిన త ర్వాత తొలిసారి ఆయన ఇక్కడికి వచ్చారు. తహసీల్దార్ మహ్మద్ అన్సారీ హార్సిలీహిల్స్‌కు సంబంధించిన విషయాలను ఆయనకు వివరించారు. అనంతరం ఇక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లారు.
నూతన నియామకం
గాలివీడు: అంతర్జాతీయ మానవ హక్కుల రక్షణ కమిషన్ ఏపీ మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్‌గా ఎం. మంజులను నియమించినట్లుగా ఆదివారం ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. గాలివీడు పీహెచ్సీ లో స్టాఫ్‌నర్స్‌గా విధులు నిర్వహిస్తున్న తనను అంతర్జాతీయ మానవ హక్కుల రక్షణ కమిషన్ అధ్యక్షుడు డాక్టర్ హెచ్‌ఎండీ ముజహీద్ మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
26న శ్రీశ్రీ అనంతపురం గంగమ్మ జాతరకు వేలం
లక్కిరెడ్డిపల్లి: మండలంలోని అనంతపురం గ్రామంలో వెలసిన గంగమ్మ దేవస్థానంలో ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 2 వరకు నిర్వహించనున్న జాతరకు సంబంధించి వేలంపాటను ఈనెల 26వన నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతరలో తలనీలాలు, కొబ్బరికాయలు, టోల్గెట్, ప్రతి ఆదివారం ఏడాది పాటు ఆలయం ముందు కొబ్బరికాయలు, పూలదండల విక్రయానికి సంబంధించిన వేలం భక్తులు, గ్రామస్తుల సమక్షంలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. వేలంలో పాల్గొనేవారు ముందుగా రూ. 50 వేలు డిపాజిట్ చేసి పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు.
శ్రీలక్ష్మీనరసింహుడికి
బంగారు కిరీటం
గుర్రంకొండ: మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామికి చెన్త్నెకు చెందిన భక్తులు బంగారు కిరీటాన్ని బహూకరించారు. తమిళనాడు రాష్ట్రం చెన్త్నెకు చెందిన ఎన్. వసంతలక్ష్మీ, ఆమె కుమార్తె మాధవీ, అల్లుడు మనోహర్, కుటుంబ సభ్యులు కలిసి రూ. 27,01,587 విలువ చేసే 340.630 గ్రాముల బంగారు కిరీటాన్ని ఆదివారం ఆలయం వద్దకు తీసుకొచ్చారు. అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి తీర్థప్రసాదాలను దాతలకు అందజేశారు. అనంతరం దాతలు బంగారు కిరీటాన్ని టీటీడీ సూపరింటెండెంట్ మునిబాలకుమార్‌కు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఇన్స్‌పెక్టర్ కృష్ణమూర్తి, అర్చకులు గోపాలాబట్టర్, కృష్ణప్రసాద్‌బట్టర్, అనిల్‌కుమార్, గోకుల్‌స్వామి పాల్గొన్నారు.
హాస్టల్ మరమ్మతులకు రూ.13.90 కోట్లు
పీలేరు రూరల్: జిల్లాలో 43 సాంఘిక సంక్షేమ వసతిగృహాల మరమ్మతులకు రూ.13.90 కోట్లు నిధులు మంజూరైనట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి జయప్రకాష్ తెలిపారు. ఆదివారం పీలేరులోని ఎస్సీ బాలికల వసతిగృహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. పీలేరు డివిజన్‌లో 12 వసతిగృహాలకు రూ. 4.19 లక్షలు మంజూరయ్యాయని, త్వరలోనే మరమ్మతులు చేపడతామన్నారు. జిల్లా విజలెన్స్ అండ్ మానటరింగ్ కమిటీ సభ్యులు పాలకుంట శ్రీనివాసులు, ఎస్. బోదేషావలి, వార్డెన్లు రమాదేవి, కుసుమకుమారి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment