గిరిజన గురుకుల పాఠశాల సమస్యలు పరిష్కరించాలి
ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్‌నాయక్
పీలేరు: గిరిజన గురుకుల పాఠశాలల్లోని సమస్యలు పరిష్కరించాలని ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్‌నాయక్ అన్నారు. ఆదివారం స్థానిక కోటపల్లెలోని ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. విద్యార్థినులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినుల సంక్షేమం, విద్యాభివృద్ధితోపాటు గురుకుల పాఠశాలల్లో పని చేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా గిరిజనులు ఉన్నారని, వారి అభివృద్ధికి ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రతి గిరిజన గ్రామానికి ప్రత్యేక గృహాలు, స్మశాన వాటికల సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. గిరిజన గురుకుల పాఠశాలలకు ప్రత్యేక భవనాలు లేకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. 10 నుంచి 13 ఏళ్లుగా గిరిజన గురుకుల పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రభుత్వం నిర్వహిస్తున్న డీఎస్సీలో ప్రాధాన్యత కల్పించాలని కోరారు. గిరిజన పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉండడంతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కేవీపల్లె మండలం జిల్లేళ్లమంద పెద్దతండా వాసుల భూసమస్యలు పరిష్కరించాలని, గ్రామానికి స్మశానవాటికకు స్థలం కేటాయించాలని తహసీల్దార్ క్రాంతికుమార్‌కు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి తేజస్విని, ప్రిన్సిపాల్ ఆర్. ప్రసాదరావు, ఈఓపీఆర్‌డీ లతీఫ్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment