ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు
మదనపల్లె : ద్విచక్రవాహనం ఢీకొని ఓ వ్యక్తి గాయపడిన ఘటన గురువారం మదనపల్లెలో జరిగింది. చంద్రాకాలనీకి చెందిన రామచంద్ర (60) బైపాస్‌రోడ్డు వద్ద రోడ్డు దాటుతుండగా, ఎదురుగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొంది. ప్రమాదంలో రామచంద్ర గాయపడగా, గమనించిన స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
పిడుగు పాటుకు
రెండు పాడి ఆవులు మృతి
కేవీపల్లె : పిడుగు పాటుకు రెండు పాడి ఆవులు మృతి చెందిన సంఘటన మండలంలోని తిమ్మాపురం పంచాయతీ ఎన్టీఆర్ కాలనీలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గురువారం ఎన్టీఆర్ కాలనీకి చెందిన ఉప్పుతోలు మోహన్ తన పాడి ఆవులను ఓ చెట్టుకింద కట్టి ఉంచాడు. గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చింది. దీంతోపాటు పిడుగుపడటంతో రెండు పాడి ఆవులు మృతి చెందాయి. రూ. 1.20 లక్షలు విలువ చేసే పాడి ఆవులు మృతి చెందాయని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు.
సమస్యలు పరిష్కరించకుంటే 25 నుంచి సమ్మె
సిద్దవటం : తమ సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 25వ తేదీ నుంచి సమ్మె చేపట్టనున్నట్లు సిద్దవటం 108 ఉద్యోగులు తెలిపారు. సిద్దవటం ఇన్‌చార్జి తహసీల్దార్ మాధవీలతకు, ఎంపీడీఓ ఫణిరాజకుమారికి గురువారం వారు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 108 ని ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలన్నారు. 12 గంటల పని విధానాన్ని రద్దుచేసి 8 గంటల విధానాన్ని అమలు చేయాలన్నారు.
ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా వెంకటరమణ
రామాపురం : అన్నమయ్య జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా చిట్లూరు దళితవాడకు చెందిన జి.వెంకటరమణను నియమించారు. గురువారం విజయవాడలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి నుంచి నియామక పత్రాన్ని అందుకున్నారు.
జాతీయ స్థాయి
క్రీడా పోటీలకు ఎంపిక
ఓబులవారిపల్లె : టెన్నిస్ బాల్ క్రికెట్‌లో జాతీయ స్థాయి పోటీలకు చిన్నఓరంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొమ్మిదవ తరగతి విద్యార్థినులు బాను, సారా ఆల్ ఇండియా నేషనల్ టెన్నిస్ వరల్డ్ క్రికెట్‌కు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు తెలిపారు. నవంబర్ 18 నుంచి జమ్ము కాశ్మీర్‌లోని జమ్ముతావిలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో వీరు ఆడనున్నారు. విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment