బాలల చేతిలోనే దేశ భవితవ్యం
సంబేపల్లె / రాయచోటి టౌన్ : నేటి తరం పిల్లలే రేపటి తరానికి పునాదులని వారి మీదే దేశ భవితవ్యం ఆధారపడి ఉందని జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ సాధికారత అధికారి పి. రమాదేవి అన్నారు. గురువారం సంబేపల్లె మండలం ఎర్రగుంట్ల సమీపంలోని డాక్టర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నేటి తరం పిల్లలు ఆరోగ్యంగా, ఆనందకరమైన వాతావరణంలో ఎదగాలని కోరుకున్న ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ అన్నారు. బాలల కోసం ప్రత్యేక చట్టాలను తయారు చేసుకున్నామని వాటిని గురించి విపులంగా తెలుసుకోవాలన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పడు వెంటనే 1098కు ఫోన్ చేయవచ్చన్నారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం, అదనపు వైద్యాధికారి డాక్టర్ దేవశిరోమణి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి బి. వినోద్ కుమార్, గుడ్ నైబర్స్ ఎన్జీఓ నాగేశ్వరావు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ రంగరాజు, వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ ప్రభావతి, గురుకుల పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment