సర్కారు భూమితో వ్యాపారం
టాస్క్‌ఫోర్స్ : సంబేపల్లె మండల పరిధిలోని దేవపట్ల గ్రామంలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న పొలం సర్వే నంబర్ 290లో 3.73 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో నమోదైంది. అయితే కొత్త ప్రభుత్వం కొలువు తీరినప్పటి నుంచి ఆ భూమిలో అధికార పార్టీ నాయకులు విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం. రెవెన్యూ నిబంధనల్లో గ్రామ అవసరాలకు కొంత భూమిని కేటాయించడం మొదటి నుంచి అవలంబిస్తున్న ప్రక్రియ. జాతీయ రహదారి పక్కన ఉన్న కోట్లు విలువజేసే ఈ భూమిని అధికార పార్టీ నాయకులు విక్రయిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి పక్కన జరుగుతున్న ఈ తంతును రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోకపోవడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. ఫ్రీహోల్డ్ భూమి అంటూ ఈ భూమి తమదే అంటూ లక్షల్లో విక్రయిస్తూ పెద్ద మొత్తంలో ఆదాయాన్ని గడిస్తున్నట్లు ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఈ విషయమై తహసీల్దార్ వెంకటేశ్వర్లును వివరణ కోరగా దేవపట్ల గ్రామంలోని పొలం సర్వే నంబర్ 290 గురించి సమాచారం అందిందని రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఫ్రీహోల్డ్ భూమి అంటూ విక్రయిస్తున్న అధికార పార్టీ నాయకులు
పట్టించుకోని అధికార యంత్రాంగం
Comments
Please login to add a commentAdd a comment