బాబు పాలన అంతా మోసమే
● అసెంబ్లీలో ఆత్మస్తుతి, పరనింద తప్ప మరొకటి లేదు
● మోసం చేయడమే లక్ష్యంగా పాలన
● సంపద సృష్టికర్త కాదు.. మోసాల సృష్టికర్త
● చంద్రబాబు సీఎం కావడంతో అన్ని పథకాలు క్లోజ్
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాఽథరెడ్డి
రాజంపేట: ప్రజలకు మోసం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాలన చేస్తున్నారని, సంపద సృష్టికర్తగా కాకుండా మోసాల సృష్టికర్తగా రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాఽథరెడ్డి విమర్శించారు. తన కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అసెంబ్లీలో అబద్ధాల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. అసెంబ్లీలో ఆత్మస్తుతి, పరనిందే తప్ప మరొకటి లేదన్నారు. సూపర్‌సిక్స్ పథకాలు ఒక మోసం అని ప్రజలు ఇప్పటికే గుర్తించారన్నారు. వీటన్నింటినీ ప్రశ్నించినందుకు ఇండియాలో ఎక్కడాలేని విధంగా ఏకంగా 680 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులకు నోటీసులు ఇచ్చారని, 147 మందిపై కేసులు పెట్టారని, 49 మందిని అరెస్టు చేశారని.. ఇది అత్యంత దారుణమన్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులను సైతం ఉల్లంఘించి అరెస్టులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం మహిళాలోకానికి అండగా నిలవలేకపోయిందని దుయ్యబట్టారు. చంద్రబాబు తన బడ్జెట్‌లో కూడా మహిళలను అంకెలగారిడీతో మోసం చేశారన్నారు. ప్రతి సెక్షన్‌ను మోసం చేస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనలో అన్ని రకాలుగా రాష్ట్రం కుదేలైపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోకుండా ప్రజల్ని మోసం చేస్తున్న పరిస్థితి నేడు ప్రజలు కళ్లారా చూస్తున్నారన్నారు. సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అన్ని పథకాలు క్లోజ్ అయ్యాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన పాలనలో అన్ని వర్గాలకు తన బాదుడే బాదుడు ప్రజలకు రుచిచూపించారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు తన దుష్ప్రచారం మానలేదన్నారు. బడ్జెట్‌లో పథకాలకు కేటాయింపులు సరిపడగా లేవన్నారు. అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పాలన కొనసాగిందని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా దేశానికే రోల్‌మాడల్‌గా నిలిచారని ఆకేపాటి గుర్తుచేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో ఎన్నికల మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలు చేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment