సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత
నిమ్మనపల్లె: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నారు. గురువారం నిమ్మనపల్లె మహిళా సమాఖ్య కార్యాలయంలో సీఎంఓ పీజీఆర్‌ఎస్ దరఖాస్తులు, విద్యార్థులకు అపార్ ఐడీ జనరేషన్, హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్, పక్కాగృహ నిర్మాణ ప్రగతి, ఎన్‌సీపీఐ బ్యాంకు అకౌంట్లకు ఆధార్ లింక్ తదితర అంశాలపై మదనపల్లె ఇన్‌చార్జ్ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర, మండల స్థాయి అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎంఓ పీజీఆర్‌ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక)లో అందిన ఫిర్యాదులపై అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలన్నారు. అర్జీదారులతో స్వయంగా మాట్లాడి, నిష్పక్షపాతంగా సమస్యలు పరిష్కరించాలన్నారు. ఇసుక డంప్ చేసినా, యంత్రాలు ఉపయోగించినా కఠిన చర్యలు తప్పవన్నారు. అనంతరం ప్రజల నుంచి వినతులను స్వీకరించి, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ముష్టూరు గ్రామంలో ఓ రైతు పీజీఆర్‌ఎస్‌లో దరఖాస్తు చేసుకోగా, సదరు భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ నరసింహులు, మండల ప్రత్యేక అధికారి ప్రసాద్, డ్వామా పీడీ వెంకటరత్నం, ఏపీడీ శ్రీనివాసులు, తహసీల్దార్ ధనుంజయలు, ఎంపీడీఓ పరమేశ్వర్ రెడ్డి, ఎస్‌ఐ తిప్పేస్వామి, ఏపీఎం మురళి, ఏపీఓ రమేష్, ఏఓ రమేష్ బాబు, అధికారులు పాల్గొన్నారు.
సదుపాయాలు తప్పనిసరి
కలికిరి (వాల్మీకిపురం): అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌళిక సదుపాయాలుండాలని కలెక్టర్ శ్రీధర్ అన్నా రు. వాల్మీకిపురం–4 అంగన్‌వాడీ కేంద్రాన్ని గురువా రం ఆయన తనిఖీ చేశారు. పిల్లలకు మిఠాయిలు పంచి పెట్టి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రంలోని సమస్యలు, ఆహార నాణ్యతపై విచారించారు. మండల పరిధిలోని జర్రావారిపల్లి పంచాయతీలో రూ.5లక్షల అంచనా వ్యయం, చింతలవారిపల్లిలో రూ.4లక్షల అంచనా వ్యయంతో జరుగుతున్న సిమెంటు రోడ్డు పనులను కలెక్టరు తనిఖీ చేశారు. కార్యక్రమాలలో మదనపల్లి ఆర్డీఓ రాఘవేంద్ర, డ్వామా పీడీ వెంకటరత్నం, జిల్లా సర్వే అధికారి భరత్‌కుమార్, తహశీల్దార్ పామిలేటి పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్
Comments
Please login to add a commentAdd a comment