రాయచోటి: పల్లెపండుగ పనులలో పురోగతి సాధించాలని తహసీల్దార్లు, ఎంపీడీఓలను, అధికారులను జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ ఆదేశించారు. గురువారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్సు హాల్ నుంచి అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ సిబ్బంది, ఎంఈఓలు తదితరులతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలు, పల్లె పండుగ, విద్యార్థులకు అపార్ ఐడీల నమోదు, సర్వేరాళ్లపై బొమ్మల తొలగింపు తదితర అంశాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డీఆర్ఓ మధుసూదన్ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment