కోడిగుడ్డు అధరహో!
రాయచోటి: కోడిగుడ్డు ధరలు మాత్రం వేడి చేయకుండానే ఉడికిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రిటైల్ మార్కెట్‌లో ఒక్కో గుడ్డు రూ.7.50లకు విక్రయిస్తున్నారు. కూరగాయలతో పాటు కోడ్డి గుడ్డు ధరలు కూడా కొండెక్కడంతో కొనుగోలుదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల పెంపకం అధికం కావడంతో పాటు కోడిగుడ్ల రేటు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండేది. అయితే పక్క రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు సబ్సిడీలు ఇవ్వడంతో పౌల్ట్రీ ఫామ్స్ పెరిగిపోయాయి. ఫలితంగా ఏపీ నుంచి ఎగుమతులు తగ్గిపోయినట్లు సమాచారం. కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో చాలా చోట్ల మన రాష్ట్రంలో పౌల్ట్రీ ఫామ్స్ మూసివేశారు.ఫలితంగా కోడిగుడ్డు రేటు పెరిగిపోయింది. పెరిగిన భారం వినియోగదారుడి నెత్తినపడటంతో గుడ్డు రేటుకు రెక్కలు వచ్చాయి.
ఉత్పత్తికి పెరిగిన ఖర్చు: ఒక గుడ్డు ఉత్పత్తికి పౌల్ట్రీలలోనే రూ.5 వరకు ఖర్చవుతోందని వ్యాపారులు చెబుతున్నారు. చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్ ప్రాంతాల నుంచి మన ప్రాంతాలకు గుడ్ల సరఫరా జరుగుతుంటుంది. అక్కడ నుంచి ఇక్కడికి చేరుకొని వినియోగదారునికి అందడానికి రూ.7.50 పడుతోందని చెబుతున్నారు. ఆగస్టులో గుడ్డు రేటు రూ.5.70గా ఉంటే ప్రస్తుతం అది రూ.7.50కి చేరింది. ఈజీగా చేసుకోవడంతో పాటు బలవర్ధకమైన ఆహారం కావడంతో చాలా మంది గుడ్డుని ప్రిఫర్ చేస్తారు. బేకరీ ఫుడ్స్‌లో కూడా కోడిగుడ్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. దాంతో వాటి రేట్లు కూడా పెరిగిపోతున్నాయని కొనుగోలుదారులు వాపోతున్నారు.
విద్యార్థులకు కష్టమే
పెరిగిన ధరలతో విద్యార్థులకు గుడ్డు అందుతుందన్న ఆశలు కనిపించడం లేదు. అనుకూలమైన ధరలు ఉన్న సమయంలోనే గోళీల సైజులో ఉన్న గుడ్లనైనా అందించేవారు. నేడు పెరిగిన ధరల కారణంగా ఆ చిన్న గుడ్లు కూడా విద్యార్థులకు అందకుండా పోతున్నాయన్న భయం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment