అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
ప్రొద్దుటూరు క్రైం : మండలంలోని అమృతానగర్‌కు చెందిన కురవ నరేష్‌కుమార్ (42) అనే ఆటో డ్రైవర్ అప్పుల బాధ తాళలేక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నరేష్‌కుమార్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. అతనికి భార్య గౌరీ, బీటెక్ చదివే కుమారుడు ఉన్నారు. ఇటీవల అతను అధికంగా అప్పులు చేసి మద్యానికి బానిసయ్యాడు. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి అధికమవ్వడంతో ఇంట్లోని రేకుల పైపునకు చీర చుట్టుకొని శనివారం ఉదయం ఉరేసుకున్నాడు. భార్య గౌరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ తెలిపారు.
ఇద్దరు న్యాయవాదులకు సర్టిఫికెట్లు
నందలూరు : నందలూరు బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ అలీ, సెక్రటరీ సుబ్బరామయ్యలు మధ్యవర్తిత్వంపై జరిగిన శిక్షణలో పాల్గొని సర్టిఫికెట్లు పొందారు. ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, ఏపీ హైకోర్టు జడ్జి నరేందర్ వీరికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో కడప జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ నిర్వహించిన ఐదురోజుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment