బాలిక అదృశ్యం
సంబేపల్లె : మండల పరిధిలోని రౌతుకుంట గ్రామంలో బాలిక అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు కుమ్మరపల్లెకు చెందిన 13 సంవత్సరాల బాలిక శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించడం లేదని శనివారం బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈమేరకు సంబేపల్లె ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
మదనపల్లె : వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ రామచంద్ర తెలిపారు. పట్టణంలోని బసినికొండ పుంగనూరు రోడ్డు సాయిబాబా టెంపుల్ వద్ద నివాసం ఉన్న డ్రైవర్ ఎస్.ఎం.డీ.షా అలీ ముర్షాద్(35) ఈనెల 13న ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయాడు. బంధువులు పలుచోట్ల గాలించినా ఫలితం లేకపోవడంతో శనివారం అతడి భార్య షేక్‌నూరీ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రెండు లారీలు ఢీ
– ఇద్దరికి తీవ్ర గాయాలు
ఓబులవారిపల్లె : మండలంలోని రెడ్డిపల్లి చెరువుకట్ట సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం ఉదయం రెండు లారీలు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా నుంచి ఓబులవారిపల్లెకు గ్యాస్ సిలిండర్లను తీసుకెళ్తున్న లారీ తమిళనాడు నుంచి సరుకు తీసుకు వెళ్తున్న కంటైనర్ లారీ రెడ్డిపల్లి చెరువుకట్ట వద్దకు రాగానే ఎదురెదురుగా ఢీ కొన్నాయి. దీంతో రెండు లారీల ముందు భాగాలు దెబ్బతిన్నాయి. లారీ డ్రైవర్లు ఇద్దరు క్యాబిన్‌లో ఇరుక్కుపోగా జేసీబీ సహాయంతో రెండు లారీలను విడదీసి తీవ్రంగా గాయపడిన డ్రైవర్లను బయటకు తీశారు. డ్రైవర్లు మూర్తి, నల్లబోతుల వెంకటేశ్వర్లును 108 వాహనంలో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్యాస్ సిలిండర్లు ఉన్న లారీ డ్రైవర్ నల్లబోతుల వెంకటేశ్వర్లు వేగంగా రాగ్ రూట్‌లో రావడమే ప్రమాదానికి కారణమైందని మూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. రైల్వేకోడూరు రూరల్ సీఐ వెంకటేశ్వర్లు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment